వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంటలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో (జూన్ 24, 2025) మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత ఇన్‌ఫెర్టిలిటీ, టెస్ట్ ట్యూబ్ బేబీ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్టు ఆస్పత్రి వారు తెలిపారు. సంతాన సమస్యలున్న వారు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ నకు హాజరుకావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ తో పాటు కన్సల్టేషన్, సెమెన్ ఎనాలిసిస్ ఉచితంగా నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.
ఐవీఎఫ్.. స్పాట్ బుకింగ్స్ పై 10 శాతం డిస్కౌంట్( తగ్గింపు) ఉంటుందని వెల్లడించారు. ఇందిరా ఐవీఎఫ్ ద్వారా ఉచిత సంప్రదింపుల నమోదు కోసం 96525 27171, 80745 96507 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఇన్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ భవ్య ఈ క్యాంప్ నకు హాజరుకానున్నట్టు తెలిపారు.