•  ఆశీర్వదించి.. అవకాశమిస్తే.. అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా
     

వేద న్యూస్, ఇల్లందకుంట:
ప్రజా సేవే లక్ష్యంగా.. గ్రామాభివృద్ధియే ధ్యేయంగా తాను గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేశానని గడ్డివానిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన టేకుర్తిలో నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడతూ.. సేవే లక్ష్యంగా ముందుకొచ్చిన తనను ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని గడ్డివానిపల్లి గ్రామ ప్రజలను శ్రీనివాస్ అభ్యర్థించారు.

విద్యావంతుడినైన తాను గ్రామాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పని చేస్తానని చెప్పారు.