• రాజన్న ఆలయ మూసివేత పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి
  • ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలి
  • ప్రభుత్వానికి ప్రతాపరామకృష్ణ డిమాండ్

 

వేద న్యూస్,వేములవాడ:

 

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తుండటం,మీతో పాటు రాజన్న ఆలయం మూసివేత పై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని ప్రతాపరామకృష్ణ కోరారు.

 

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో దసరా తర్వాత మూసివేస్తామని అన్నారని, దసరా తర్వాత నా? ముందా? అనేది శ్వేత పత్రం విడుదల చేయాలని,ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో వివరణ ఇవ్వాలని, అభివృద్ధిలో భాగంగా గుడి లోపల దర్గాను కూడా మార్చాలని, దర్గాను ముట్టుకోకుండా హిందూ దేవాలయాల విగ్రహాలను ముట్టుకుంటే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.

దేవాలయం మూసివేతతో ప్రత్యక్షంగా 500 కుటుంబాలు పరోక్షంగా 3000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే దేవాలయ అభివృద్ధిని ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో స్పష్టంగా తెలపాలని అన్నారు.