వేద న్యూస్, కాజీపేట:
రోడ్డు, రోడ్లపై ప్రయాణికుల భద్రతకు ఓ కార్పొరేటర్ ముందడుగు వేశారు. స్థానిక పోలీసుల సహకారంతో గుంతలు పూడ్చివేయించారు. వివరాల్లోకెళితే..
హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ..జి డబ్ల్యూ ఎం సి పరిధిలోని 47, 62, 63 డివిజన్ల లో కాజీపేట పట్టణంలో ఉన్న జాతీయ రహదారిపై ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారులపై గుంతలు ఏర్పడి, రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారి.. ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈ కారణంగా స్థానిక 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి స్థానిక కాజిపేట్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై శివ సహాయ సహకారాలతో డీజిల్ కాలనీ, బాపూజీ నగర్, రోమన్ క్యాథలిక్ చర్చ్, కాజీపేట చౌరస్తా, ఫాతిమా నగర్ జంక్షన్ ల వద్ద గుంతలను సిమెంట్ కాంక్రీట్ తో పూడ్చారు.

సహాయ సహకారాలు అందించిన కాజిపేట పట్టణ పోలీసులకు ట్రాఫిక్ సీఐ, ట్రాఫిక్ ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది అందరికీ పేరుపేరునా 63వ డివిజన్ కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు క్రాంతి, భరత్ రాజ్, 63వ డివిజన్ మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ బిలాల్, మహమ్మద్ సిరాజ్, డాక్టర్ ప్రభాకర్, సందేల వినోద్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ బిలాల్ తదితరులు పాల్గొన్నారు.

