వేదన్యూస్ – ఢిల్లీ
రేషన్ కార్డు హోల్డర్స్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇంకా కేవైసీ చేయించుకోని వాళ్ల కోసం గడవును పెంచుతున్నట్లు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కేవైసీ ప్రక్రియ గడవును ఈనెల ముప్పై తారీఖు వరకూ పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.ఈ గడవు గత నెల ముప్పై ఒకటో తారీఖునే ముగియడంతో తాజాగా ఆ గడవును ఏఫ్రిల్ ముప్పై తారీఖు వరకు పెంచింది.
ఈకేవైసీ యొక్క ప్రధాన ఉద్ధేశ్యం జాతీయ ఆహార భద్రత చట్టం కింద అర్హులైన వారికి రేషన్ కార్డులను అందజేయడం. అర్హులైన వారికి రేషన్ కార్డుల ద్వారా అందే ఫలాలను చేరేలా చేయడం. ఈకేవైసీ ద్వారా అర్హత లేని వాళ్ల వలన కలిగే దుర్వినియోగాన్ని తగ్గిస్తుందని ప్రభుత్వం తెలిపింది.