- విశాలమైన క్రీడాప్రాంగణంలో విద్యార్థులకు ఆటలు
- క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందేలా టీచర్ల పాఠాలు
వేద న్యూస్, జమ్మికుంట:
పోటీతత్వం విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో విద్యావ్యవస్థలో.. మార్కెట్ మాయాజాలంతో ‘మార్కులు’ కీలకంగా మారాయి.
‘‘ఒకటి..ఒకటి..ఒకటి..రెండు..రెండు..రెండు..’’ అంటూ ప్రకటనలతో విద్యార్థులను తమ వైపునకు తిప్పుకునేలా కొన్ని విద్యా సంస్థలు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో ఆ ధోరణికి కొంత భిన్నంగా.. సమాజంలో నైతికత పెంపొందేలా..‘నేటి బాలలే రేపటి పౌరులు’ అనే విషయం గుర్తిస్తూ.. విలువలకుప్రాధాన్యతనిస్తూ..భారతీయత..సంస్కృతి సంప్రదాయాలు, దేశభక్తి..,ఆటలు, ధర్మం వంటి విషయాలను విద్యార్థులకు ‘ఆవాసం’లో బోధిస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని కేశవపురం శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయంలో ఆంగ్ల మాధ్యమంలో టీచర్లు చక్కటి విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు.
సువిశాలమైన చక్కటి క్రీడా ప్రాంగణం
కొన్ని పాఠశాలలకు అయితే కనీసంగా చిన్న మైదానం కూడా లేని పరిస్థితుల్లో సువిశాలమైన క్రీడా ప్రాంగణంలో సుమారు 23 ఎకరాల్లో శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం కొనసాగుతుండటం విశేషం.
ఆంగ్ల మాధ్యమంలో స్టూడెంట్స్‌కు అర్థమయ్యేలా పాఠాలను ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. బాల, బాలికలు మొత్తం పాఠశాలలో ప్రస్తుతం 532 మంది ఉండగా, పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది 70 మంది ఉన్నారు. బాలికలు 149 మంది, 383 మంది బాలురు ఉన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలగా కొనసాగుతున్న ఈ విద్యాలయంలో 28 మంది ఆచార్యులు, ప్రధానాచార్యులు 24/7 అందుబాటులో ఉంటారు.
క్రీడలకూ తగు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల నుంచి ‘ఖేల్‌కూద్’తో పాటు ఇతర పోటీలలో పాల్గొన్న విద్యార్థులు సుమారు 250 మందికిపైనే ఉన్నారు. భారతీయ సంప్రదాయాలతో పాటు పండుగల విశిష్టతలను వివరిస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్యంగా ఉండేలా ఉదయం వేళలో సూర్యనమస్కారాలు, యోగ, ఎక్సర్‌సైజెస్ చేయిస్తు్న్నారు. ఆధునిక సైన్స్‌ను ల్యాబరేటరీలలో ఆచరణాత్మకంగా బోధిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ హవర్స్‌కు సమయం కేటాయించేలా..కార్యాచరణ ఉంటుంది.
టీచర్లు..డిజిటల్ క్లాసెస్‌నూ చెబుతూ..విద్యార్థులకు విజ్యువలైజేషన్ పరంగా సబ్జెక్టుపైన అవగాహన కలిగేలా దృష్టి సారిస్తున్నారు.
1వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ‘ఆవాసం’లో అందుతున్న విద్య పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యతో పాటు విలువలను స్టూడెంట్స్‌లో పెంపొందించే చక్కటి పాఠశాల ‘ఆవాసం’ అని పలువురు పేర్కొన్నారు.


