వేద న్యూస్, ఆసిఫాబాద్:
అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఏ టీ ఎం ఏ ) కమిటీ డైరెక్టర్ గా కిర్మరే తరుణ్ నియమితులయ్యారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ఆయనకు నియామక పత్రాన్ని అందించారు.
సిర్పూర్ (టి) మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తరుణ్ ఆత్మ కమిటీ డైరెక్టర్గా నియమితులు కావడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ బలోపేతంతో పాటు రైతు సమస్యల పరిష్కారంలో కృషి చేస్తానని తెలిపారు.
సమాజ సేవ కోసం పని చేసే యువకుడు తరుణ్ కు చిన్న వయసులోనే ప్రజలకు, రైతులకు సేవ చేసే అవకాశం లభించిందనీ పలువురు నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. తరుణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన భవిష్యత్ లో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. తరుణ్ కు పదవి రావడం పట్ల హు డ్కిలి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.