వేద న్యూస్, వరంగల్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమలు చేయు 4 ప్రతిష్ఠాత్మక పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా( వ్యవసాయ కూలీలకు రూ.12000 ),ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల గురించి మంగళవారం ఒగ్లాపూర్ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ కేవీ రంగాచారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.

సభలో నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ప్రజలకు చదివి వినిపించచారు. అనంతరం ఎవరైనా ఇంకా ఈ నాలుగు పథకాలకు ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ల లో కొత్త దరఖాస్తులను స్వీకరించారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేశ్, ఏ.పి. ఓ.శారద, ఏ.ఈ. ఓ.సోని, ఈ.సి.రాజేష్, టి. ఏ ప్రిసిల్లా, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, గ్రామ స్థాయి ఉద్యోగులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
