వేద న్యూస్, హుజూరాబాద్:
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు.
ఆమె బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన జీవన్ కుమార్ తన భార్యకు వైద్యం చేయించడం కోసం తన స్తోమత మేరకు డబ్బులు వెచ్చించారు. ఇప్పుడు ట్రీట్మెంట్కు మరిన్ని డబ్బులు అవసరం కాగా, డబ్బులు లేక సతమతవుతున్నారు.
తన భార్యకు చికిత్స చేయించేదెలా అని ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ గుడ్ లైఫ్ రిహాబిలేషన్ హాస్పిటల్లో సువర్ణను అడ్మిట్ చేశానని, పూర్తి వైద్యం చేయాలంటే డాక్టర్ రూ.16 లక్షలు ఖర్చు అవుతోందని తెలిపారని జీవన్ పేర్కొన్నారు.
దాతలు దయతలిచి ఆపన్న హస్తం అందించి, తోచిన సాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు తన 94923 00284 నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు జమ చేయాలని కోరుతున్నారు.