వేద న్యూస్, వేములవాడ:
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని గురువారం అధికారులు వెల్లడించారు. గత 33 రోజుల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.2,16,65,140 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నగదుతో పాటు 161 గ్రాముల మిశ్రమ బంగారం, 10 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి కూడా భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఈవో రమాదేవి, కరీంనగర్ ఏసీ కార్యాలయ అధికారి రాజమౌళి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, ఆలయ సిబ్బంది, పోలీసులు మరియు రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.