వేద న్యూస్, ఆసిఫాబాద్:

మీకు కనబడిన దృశ్యం చూస్తే .. తోటలో నుంచి ఓ వ్యక్తి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ, అది తోట కాదండోయ్.. కానీ, చూస్తే మాత్రం  తోటే అనేలా ఉంటుంది. చక్కగా బంతిపూలు , అలుముకున్న పొదలు, హాయిగా పెనవేసుకుపోయినట్టుగా కనిపిస్తున్న పచ్చని ఆకులు చూస్తే.. తోటలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది.

మీకు ఈ ఫొటో చూసినపుడు అలానే అనిపిస్తుంది. కానీ, ఇది తోట కాదండోయ్.. తోట అని భావిస్తే.. పొరపడినట్లే…కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రాజురా గ్రామంలోని బొయిరే తుకారాం ఇల్లు. తన ఇంటి ముందర పొదల్లా పెరిగిన చెట్లు.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నది.