వేదన్యూస్ – మహబూబ్ నగర్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి రేవంత్ రెడ్డిని దించేస్తామని సీఎం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులను హెచ్చారిస్తూ ముదిరాజు సంఘం తరపున ఓ లేఖ రాశారు..
ఆ లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నువ్వు నీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు తెలంగాణ జనాభాలోనే ప్రథమ స్థానం ఉన్న మా ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకాటీ శ్రీహారి ముదిరాజుకు మంత్రివర్గ విస్తరణలో చోటివ్వకూడదని కుట్రలు చేస్తున్నారు.
వాకాటీ శ్రీహారి ఎవరి దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే కాలేదు. ఆయనకు మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులున్నాయి. మా ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవివ్వకపోతే మా సత్తా ఏంటో చూపిస్తాము. మీ పలుకుబడిని ఉపయోగించి అడ్డుకోవాలని చూస్తే నిన్ను ముఖ్యమంత్రి పదవి నుండి దించేస్తాము. తెలంగాణలో కాంగ్రెస్ ను ఖతం పట్టిస్తాము. ఖబద్ఢార్ బిడ్డా జాగ్రత్త అంటూ ఓ లేఖను రాశారు.