వేద న్యూస్, వేములవాడ రూరల్:
వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల వృద్ధులు, వితంతువులు ప్రతి నెలా పెన్షన్ తీసుకునేందుకు మర్రిపల్లి లేదా కొనయపల్లె గ్రామాలకు వెళ్లాల్సి వస్తుండటంతో తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. వయస్సు మీద పడిన వారికి రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించటం ఎంతో కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘‘వయస్సుతో పాటు, ఆరోగ్యం బాగాలేక పోతే ఇలా ప్రయాణించడం ప్రమాదకరం” అంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారి కావడంతో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రధాన రహదారి కావడంతో వృద్ధులకు ప్రధాన అవరోధమని అంటున్నారు.
గ్రామంలోనే పెన్షన్ పంపిణీ సౌకర్యం ఏర్పాటు చేయాలని వృద్ధులు, వితంతువులు వేడుకుంటున్నారు. ఇది సాధ్యమయ్యే వరకు నెలనెలా వారిపై ఆర్థిక భారం, శారీరక ఇబ్బందులు పెరిగే అవకాశముంది.పెన్షన్ మన హక్కు.. దాన్ని పొందటానికి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి?” అంటూ విద్యార్థులు, యువత, గ్రామస్తులు కూడా వృద్ధులకు మద్దతుగా నిలుస్తున్నారు.జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామాల్లోనే పెన్షన్ పంపిణీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.