- అమ్మవారిపేట సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని..
- జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆహ్వానం అందజేత
వేద న్యూస్, వరంగల్:
హన్మకొండ జిల్లాలోని దామెరగుట్టల వద్దనున్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆ జాతర కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు వారు సోమవారం ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
జాతర ఆర్గనైజర్ దాసి రామ్ దేవ్, జాతర కోశాధికారి బైరి నాగరాజు, బైరి హరి, ఆవు నూరి కుమారస్వామి, ఏ.రామ్మూర్తి, బి.నవీన్, రాజేష్, గోపి, స్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.