- తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేత
- విచారణ జరిపి న్యాయం చేస్తానని డీఎంహెచ్‌వో అప్పయ్య హామీ
వేద న్యూస్, హన్మకొండ:
హనుమకొండలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న “బంధన్ హాస్పిటల్” లో తనకు జరిగిన అన్యాయంపై హన్మకొండ డీఎంహెచ్ వో అప్పయ్యకు జర్నలిస్టు కృష్ణ సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ జర్నలిస్టు కృష్ణ ఇచ్చిన “బంధన్ హాస్పిటల్” ఫిర్యాదుపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విచారణలో హాస్పటల్ యాజమాన్యం తప్పు చేసినట్టు రుజువైతే హాస్పటల్ లైసెన్స్ సైతం రద్దు చేస్తామని పేర్కొన్నారు.
డీఎంహెచ్‌వోకు వినతి పత్రం ఇచ్చిన వారిలో వరంగల్ తూర్పు జర్నలిస్టులు బండి రవి, అజయ్, భాగ్యరాజ్, పెరుమాండ్ల మధు, రవితేజ, గంగరాజు, అశోక్, అమీర్, హరి, శంకర్, వేణు,కృష్ణ, తదితరులు ఉన్నారు.