వేద న్యూస్, హుజురాబాద్:
జన సైనికులు సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం సర్పంచ్ అభ్యర్థి మమత గెలుపు కోసం జనసేన కార్యకర్తలు, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
గడపగడపకు తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఆదివారం గ్రామ పరిధిలోని పెద్దలను ఓటరు మహా శయులను కలిసి.. జనసేన బలపరిచిన అభ్యర్థి మమతను గెలిపించాలని కోరారు.