వేద న్యూస్, హన్మకొండ : 

ఉమ్మడి వరంగల్ జిల్లా లో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది ఎమ్మెల్యే కడియం శ్రీహరినే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం శ్రీహరి పై పలు విమర్శలు చేశారు. 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లా లో కడియం శ్రీహరి మాదిగ అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారనీ అన్నారు. మాదిగ సామాజివర్గానికి చెందిన రాజకీయ నాయకులను వాడుకుంటూ ఈ స్థాయి వారికి కడియం శ్రీహరి వచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకు ఏ ఒక్క మాదిగ బిడ్డను కడియం శ్రీహరి ఎదగనివ్వలేదు ఎదగనివ్వడు అని అన్నారు. మాదిగల పేరు చెప్పుకొని కడియం రాజకీయంగా ఎంతో లబ్ధి పొందారని అన్నారు.

తాటికొండ రాజయ్యను రాజకీయ కుట్రాలతో మోసం చేశారని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు మొదట గుర్తింపునిచ్చింది ఎమ్మార్పీఎస్ యే అని గుర్తు చేశారు. ఎమ్మార్పీఎస్ నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి తాటికొండ రాజ్యం ఎదగడం మాదిగల అందరకి గర్వకారణమని అన్నారు. రాజయ్య ను ఉపముఖ్యమంత్రి పదవి నుండి తప్పించి ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని కడియం శ్రీహరి లాక్కున్నారని విమర్శించారు. రాజయ్య పై కావాలనే కడియం శ్రీహరి దుష్ప్రచారం చేయించారని అన్నారు.

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎదుగుదలకు కూడా కడియం శ్రీహరి సహకరించలేదని అన్నారు. ఆరూరి రమేష్ కాంట్రాక్టర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి ఒంటరిగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారని గుర్తు చేశారు. వరంగల్ ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్ కూడా మాదిగ సామాజిక వర్గం సాకారం తో ఎదిగిన వ్యక్తి అని అన్నారు.

పసునూరి దయాకర్ కూడా రెండోసారి టికెట్ రాకుండా కడియం శ్రీహరి కుట్రలు చేశారని ఆరోపించారు.చివరికి ఎన్నో డ్రామాలు ఆడి వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ టికెట్ తన కూతురికి వచ్చే విధంగా వ్యవహరించాడని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లో మాదిగల ఎదుగుదలను అడుగడుగునా కడియం శ్రీహరి అడ్డుకుంటూ వస్తున్నాడని మండి పడ్డారు. మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు ఎవరు ఓటు వేయద్దు అని పిలుపునిచ్చారు.