వేదన్యూస్ వరంగల్
ఘనంగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ
జూన్ 20న కల్వకుంట్ల కవిత పర్యటనను విజయవంతం చేయాలి : రాష్ట్ర అబ్జర్వర్ గజ్జి డేవిడ్
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ నగరంలోని పలు డివిజన్లలో జెండా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు రాష్ట్ర అబ్జర్వర్, వరంగల్ ఈస్ట్ & వెస్ట్ నియోజకవర్గాల అబ్జర్వర్ గజ్జి డేవిడ్ సూచనలతో జిల్లా ఈస్ట్ & వెస్ట్ ఇన్‌చార్జ్ వెలిగేటి రవికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ సర్కార్ బావి, 20వ డివిజన్ కాశిబుగ్గ గాంధీ విగ్రహం, 18వ డివిజన్ నర్సంపేట్ లేబర్ కాలనీ, 11వ డివిజన్ హంటర్ రోడ్ ఓల్డ్ బీట్ బజార్ జంక్షన్, 42వ డివిజన్ ఆర్టీవో ఆఫీస్ జంక్షన్, 56వ డివిజన్ గోపాల్పూర్ ప్రాంతాల్లో తెలంగాణ రక్షణ సేన జెండాలను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం ఈ నెల 20వ తేదీన వరంగల్ పోరుగడ్డపై కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగనున్న తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి గజ్జి డేవిడ్, వెలిగేటి రవికుమార్‌లు స్థల పరిశీలన నిర్వహించారు.
తదుపరి ఎనుమాములలోని వెలిగేటి రవికుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అబ్జర్వర్ గజ్జి డేవిడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే విధంగా జూన్ 20న నిర్వహించనున్న కల్వకుంట్ల కవిత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఈస్ట్ & వెస్ట్ అబ్జర్వర్ గజ్జి డేవిడ్, వరంగల్ ఈస్ట్ & వెస్ట్ ఇన్‌చార్జ్ వెలిగేటి రవికుమార్, వరంగల్ సీనియర్ నాయకురాలు నూరున్నిస, మానుపాటి రమేష్, హనుమకొండ సీనియర్ నాయకురాలు మంజుల, తడిగొప్పుల మల్లేష్, సోల్తి కిషోర్, లత, భరత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.