వేద న్యూస్, సుల్తానాబాద్:
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరం అని సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లి గ్రామ సర్పంచ్ ఓగుల పూజ రాజేందర్ పేర్కొన్నారు.

మంగళవారం మండల పరిధిలోని పలువురు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

ఎమ్మెల్యే చింతకుంటతో కలిసి కాట్నపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సర్పంచ్ ఓగుల పూజ రాజేందర్ కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. చెక్కులు అందుకున్న వారిలో దాసరి పద్మ, నోముల గీత, కొర్రె సులోచన ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *