- పట్టుదలతో కల సాకారానికి కసరత్తు
- ‘ఫైర్’ వదలకుండా ముందుకు సాగిన కెరటం
- గ్రూప్-2 అధికారిగా నిలిచి యువతకు ఆదర్శంగా ఎదిగిన తీరు
- కనగర్తి వాసికి గ్రామస్తులు, సన్నిహితుల శుభాకాంక్షలు
వేద న్యూస్, ఇల్లందకుంట:
పట్టుదల, అకుంఠిత దీక్ష ఉంటే చాలు.. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించొచ్చని నిరూపించారు కనగర్తివాసి కొత్త రాజు. ఫైర్ మెన్‌గా జమ్మికుంట స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. అకుంఠిత దీక్షతో గ్రూప్స్ కు ప్రిపేరయ్యారు. తాజాగా రిలీజయిన గ్రూప్-2 రిజల్ట్స్‌లో ఆయన ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్ఐగా ఎంపికయ్యారు.
యువతీ యువకులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని తమ లక్ష్య సాధనకు పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధించొచ్చని మాటల్లో చెప్పడం కాకుండా. .. నిరూపించే ప్రయత్నం చేశారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ఫైర్ మెన్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ తను అనుకున్న లక్ష్యం అయిన గ్రూప్-1 కోసం కొత్త రాజు సన్నద్ధమయ్యారు. గ్రూప్-2 గెజిటెడ్ అధికారిగా ప్రొహిబిషన్, ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ లో ఎస్ఐ గా జాబ్ సంపాదించారు.
తను గ్రూప్-1 లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా కొత్త రాజు వెల్లడించారు. తను పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో జీవిత భాగస్వామి శిరీష, పిల్లలు, కుటుంబ సభ్యుల సహకారం మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల కొత్త మొగిలి, వనమాలి దీవెనలతో గ్రూప్-2 జాబ్ వచ్చిందని తెలిపారు. కాగా, గ్రామీణ నేపథ్యం, సాధారణ కుటుంబం నుంచి వచ్చి గ్రూప్-2 అధికారి స్థాయికి వెళ్లడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. కనగర్తి గ్రామస్తులు, శ్రేయోభిలాషులు రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తల్లి ప్రోద్బలంతో లక్ష్యఛేదన.. గ్రూప్-2 అధికారిగా కమలాపూర్‌వాసి జడల నరేశ్
