– రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
వేద న్యూస్, వరంగల్ టౌన్:
భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని సామాజిక తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు వేస్తుందని వరంగల్ లో శనివారం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. బాబాసాహెబ్ వర్థంతి సందర్భంగా కాశిబుగ్గలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక న్యాయం, విద్యా, ఉద్యోగ అవకాశం, సమాన హక్కులు అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యువత అంబేద్కర్ ఆలోచనలను తెలుసుకుని, ఆయన చూపించిన విద్యాసాధన మార్గాన్ని అనుసరించి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి సురేఖ తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి పౌరుడికి అధికారం, హక్కులు కలిగేలా చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన చూపించిన మార్గం తమ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. పేద, బలహీన వర్గాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికి విద్య, ఆరోగ్యం, ఉపాధి అందేలా కృషి చేస్తామన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి తెలిపారు. భారత రాజ్యాంగ శిల్పిగా, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు అపారమని అన్నారు. సమాజంలో విద్యా, అవగాహన, హక్కుల గురించి ప్రజలకు అంబేద్కర్ అందించిన ప్రేరణ నేటికీ మార్గదర్శకమని చెప్పారన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాన సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు.