వేద న్యూస్, వరంగల్ టౌన్:

సమాజంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాలకు నేడు న్యాయం జరుగుతుందంటే అందుకు కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ వరంగల్ జిల్లా దళిత రత్న నమిండ్ల చిన్న స్వామి అన్నారు. గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ జాని పీరీలు వద్ద అంబేద్కర్ పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో ఎఫ్సీఐ గోదాం సర్కిల్ వద్ద అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సభ అధ్యక్షత వహించిన ఇసం పెళ్లి సాంబయ్య అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్న స్వామి మాట్లాడుతూ
అణగారిన వర్గాల స్వరం బలంగా వినిపిస్తుందంటే అందుకు కారణం కూడా అంబేద్కర్ అని తెలిపారు. అంతేకాకుండా బడుగు, బలహీన వర్గాల వారికి రక్షణ లభించడం వెనక ఆయన చేసిన కృషి ఎనలేనిదనే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. సమాజంలో పేద, అణగారిన వర్గాలకు గౌరవం దక్కేలా చేయడంలో రాజ్యాంగం పాత్ర అమోఘమని వర్ణించారు. అంతేకాకుండా పేద వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దల బాబు, 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ దుపాకీ సంతోష్ కుమార్, వల్లెం సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల రాజు, కార్యదర్శి ఇసంపల్లి కరుణాకర్, మహిళా సంఘం అధ్యక్షురాలు ఇసంపెల్లి లక్ష్మి, గాడుదుల రాజు, ఎండి సలీం, ఎండి యాకూబ్, చింతం వెంకటేష్, ఇసంపల్లి ప్రభాకర్, శృతి, సృజన్, సాల్మన్, అజయ్, పాస్టర్ శ్రీనివాస్ ఇసంపెల్లి, మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.