వేద న్యూస్, వరంగల్:

ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు శ్రీ కృష్ణుడి అలంకారంలో శనివారం  అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలకృష్ణుడి అలంకరణంలో దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారిని ఓరుగల్లు ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.