వేద న్యూస్, వరంగల్:

హైదరాబాద్ లో జరిగిన  ‘మల సింహగర్జన’కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యం లో మాల మహానాడు జిల్లా నాయకులు బక్కిఅశోక్, పోనుకంటి స్వామి మండల కన్వీనర్ కారు కరుణాకర్ మాట్లాడుతూ దళితుల వర్గీకరణ పేరిట కొన్ని దళిత సంఘాలు దళితుల మధ్య ఐక్యతను చెడగొడుతూ వాళ్ల  స్వార్థ ప్రయోజనాల కోసము దళితుల మనోభావాలను తాకట్టుపెట్టి పాలకుల దగ్గర మెప్పు పొందడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

దళితుల వర్గీకరణ పేరిట చేస్తున్న ప్రక్రియను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాలలు దళిత వర్గీకరణ వ్యతిరేకిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు వెల్లడించారు.  కార్యక్రమంలో చలో హైదరాబాద్ కార్యక్రమం కో కన్వీనర్ కంచరదాసు రాజు, భక్కి కుమారస్వామి, బక్కి నరేష్, ముడుసు రమేష్ , బేతమల్ల కృష్ణ పోనకంటి అంజయ్య, సంపత్ పసుల అశోక్ కంకణాలు మహేందర్ బక్కి,రాజశేఖర్ దాసరి సురేందర్ ఎరుకల పిచ్చయ్య సుధాకర్  తదితరులు హైదరాబాద్ కు తరలివెళ్లారు.