•  బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్

వేద న్యూస్, ఆసిఫాబాద్:

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా బీసీలకు సరైన న్యాయం చేయడం బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు.

జనాభా థామాషా ప్రకారం 60% ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు వాగ్దానం చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కులగనన చేయడానికి ముందుకు రావడం లేదనీ చెప్పారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని బీసీలకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ లో బీసీ ల రిజర్వేషన్ ఉద్యమమే మిగిలిందని బీసీ సమాజం సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బీసీ యువజన సంఘం నాయకులు బొట్టుపల్లి ప్రశాంత్, పిప్పిరి సమ్మన్న, టోమ్రే శ్రీకాంత్, నారాయణశెట్టి ఓం సాయి ప్రణీత్, కోలే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.