వేద న్యూస్, నల్లబెల్లి :
నల్లబెల్లి మండలం శనగరం గ్రామ శివారులో నేషనల్ హైవే-365లో బుధవారం ఉదయం లారీ ఢీకొట్టడంతో ఒక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం చెందాడు. అర్వాయపల్లి గ్రామానికి చెందిన బసవరాజులు కుమార్ స్వామి (50) రోడ్డు దాటుతుండగా ఘటన జరిగింది. మల్లంపల్లి నుంచి అతివేగంగా వస్తున్న TS-03-UB-0468 నంబర్ లారీ ఆకస్మికంగా ఢీకొట్టింది. తల పగిలి తీవ్ర గాయాలతో స్థానికుల ముందే మృతి చెందాడు.
సమాచారం తెలిసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అతివేగంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మృతదేహం పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి మార్చారు. దర్యాప్తు జరుగుతోంది.
