గంగపుత్రుల ఆధ్వర్యంలో పునః ప్రతిష్ట
వేద న్యూస్, వరంగల్ టౌన్:
ఖిలా వరంగల్ మండలం పడమరకోట అగర్త సామ్రాజ్యంలో స్థాపించిన కట్ట మైసమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గంగపుత్రుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయాన్ని పునః ప్రతిష్టించారు. ఈ సందర్బంగా గంగపుత్రుల నాయకులు మాట్లాడుతూ అగర్తల రాజ్యంలో నిత్యం పూజలు అందుకున్న మైసమ్మ ఆలయం అభివృద్ధికి నోచుకోక పోవడం అత్యంత బాధాకారం అన్నారు. ఆ కాలంలో రాజులూ యుద్దాలకు వెళ్లేముందు కట్ట మైసమ్మకు బలులు ఇచ్చే అన్నావాయితీ ఉందని ఇప్పటికీ చరిత్ర చెబుతుందని అన్నారు. ఖిలా వరంగల్ కోటలో ఇలాంటి పురాతణమైన శివాలయాలు, అమ్మవారి ఆలయాలు, ఎన్నో ఉన్నాయని వాటిని ప్రభుత్వం చొరవ తీసుకుని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కాకతీయుల కోట అభివృద్ధికి నోచుకోవడం లేదని పురావాస్తూ శాఖ శిధిలాస్థకు చేరిన ఆలయాలను గుర్తించి అభివృద్ధి చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనుమాస కుమారస్వామి, అనుమాస సత్యనారాయణ, గుడిబోయిన గణేష్, బైరి బాలరాజు, బైరి సతీష్, గుడిబోయిన రామకృష్ణ, బైరి సురేష్, తదితరుల గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.