•  ‘అమర కిరణం’ కవితా సంకలన ఆవిష్కరణ

వేద న్యూస్, కరీంనగర్:
ఆర్యాణి సకల కళావేదిక, శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ మంథని ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో దూడపాక శ్రీధర్ సంపాదకత్వంలో వెలువడిన ‘అమర కిరణం’ కవితా సంకలనాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ప్రమఖ కవి, రచయిత విమర్శకులు భవానీ సాహిత్య వేదిక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవేదనలోంచి, ఆలోచనల్లోంచి వెలువడే సృజనాత్మకత రూపమే కవిత్వం అన్నారు.

వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న పలువురిని ప్రోత్సహిస్తూ స్ఫూర్తి శిఖరం అవార్డులను అందిస్తున్న ఆర్యాణి, గౌతమేశ్వర సంస్థల అధ్యక్షులు దూడపాక శ్రీధర్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన సామాజిక, పర్యావరణ, కళా, వైద్య, సాహిత్య, సంగీత తదితర రంగాల్లో పేరుగాంచిన ప్రముఖులను జ్ఞాపిక, శాలువా, మెడల్ తో సత్కరించారు.

సంస్థ ద్వారా సన్మానం పొందినవారు ఇంకా సమాజానికి విస్తృతమైన సేవలందించాలని సంస్థ అధ్యక్షులు శ్రీధర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ స్త్రీకంఠ గాయకులు, గిన్నీస్ బుక్ సర్టిఫికెట్ హోల్డర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం, ప్రముఖ కవి పొర్ల వేణుగోపాలరావు, ప్రముఖ పర్యావరణవేత్త పిట్టల రవిబాబు, ప్రముఖ రంగస్థల నటులు బి.యన్.కృష్ణవేణి పాల్గొన్న కార్యక్రమంలో మణి రాయల్ పుస్తకాన్ని సమీక్షించారు.