వరంగల్ వేదన్యూస్
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 50 సంవత్సరాలపాటు సీనియర్ గుమస్తా గా పనిచేసి ఇటీవల మరణించిన వరంగల్ తూర్పు కోటకు చెందిన శ్రీరామ్ కొమురయ్య, కాశిబుగ్గకు చెందిన వంగరి గౌరీ శంకర్ కుటుంబ సభ్యులకు మార్కెట్ గుమస్తా సంఘం సంతాపం తెలిపింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన మరణించిన గుమస్తాలకు సంతాప సభ నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని సంఘం బాధ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
వరంగల్ గ్రైన్ మార్కెట్ గుమస్తా సంఘం అధ్యక్షులు ఇనుముల మల్లేశం, వర్కింగ్ ప్రసిడెంట్ పుప్పాల రాజేందర్, ఉపాధ్యక్షుడు ముత్తినేని శ్రీనివాస్, కార్యదర్శి సూర్గం వేణుగోపాల్, సుంచు జగదీష్, పెసరు కుమారస్వామి, కాటన్ సెక్షన్ వేణు, సుదీర్, వైకుంఠం, వెంకటేష్, బి. సతీష్ తదితరులు పాల్గొన్నారు.
