jupally krishna rao

వేదన్యూస్ – గాంధీ భవన్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన నాలుగు వందల ఎకరాల భూమిలో అడవి ఉంది. నెమళ్లు.. జింకలు ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని ఆగమాగం చేయకండి. మేము అభివృద్ధికి అడ్డు కాదు. నిలువు కాదు. ఆ ప్రాంతాన్ని కాకుండా వేరే చోట అభివృద్ధి చేయండని సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులందరూ ముక్తకంఠంతో యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి మద్ధతుగా నిలుస్తున్నారు.

ఈ తరుణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ” ప్రభుత్వ భూమిలో చెట్లు పెరిగినంత మాత్రాన అడవి అయిపోతుందా..?. ఆ అడవిలో జింకలు .. నెమళ్లు ఉంటయా అని ప్రశ్నించారు.

గతంలో ప్రవేట్ వ్యక్తుల ఫరమైన ప్రభుత్వ భూమిని మేము అధికారంలోకి రాగానే చట్టం పరంగా తీసుకున్నాము. యూనివర్సిటీకి చెందిన అంగుళం భూమి కూడా మేము తీసుకోలేదు. బీజేపీ , బీఆర్ఎస్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.