Screenshot

– ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి:

ఆమనగల్లు గ్రామం నా పుట్టినిల్లని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.సోమవారం ఉదయం వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు లక్ష్మీదేవి గూడెం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆమనగల్లు గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఆమనగల శ్రీ రామలింగేశ్వర దేవాలయానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేశానని తెలిపారు.సన్న బియ్యం పథకం దేశ చరిత్రలోనే చారిత్రక ఘట్టంగా మిగిలిందన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పిల్లల సందీప్ నాయుడుని కత్తెర గుర్తు కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.అంతకుముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పిల్లల సందీప్ నాయుడుని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి బంటు చొక్కాయ్య గౌడ్, శ్రీ రామలింగేశ్వర దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.