• మనిషి కేంద్రంగా అభివృద్ధి సరికాదు–పర్యావరణ సమతుల్యతే మన భవిష్యత్తు
  • ప్రకృతి రక్షణకు ప్రతిజ్ఞ–ప్రతి ప్రపంచ పౌరుడి బాధ్యత
  • పర్యావరణ సమతుల్యత లేకపోతే–జీవం లేని అభివృద్ధి నిష్ప్రయోజనం
  • సమగ్ర జీవావరణ వ్యవస్థలంటే–సజీవ, నిర్జీవ ఘటకాల పరస్పర చర్య
  • ఆవరణ వ్యవస్థలకు విఘాతం–మానవ కృత్రిమ చర్యల పర్యవసానం
  • పగడపు దిబ్బల నుండి భౌమ్యావరణం దాకా–ప్రమాదంలో అన్ని ఆవాసాలు
  • మానవ-కేంద్రీకృత అభివృద్ధి–పర్యావరణానికి ముప్పు
  • మానవ కృత్యాలతో పెరిగిన అసమతుల్యత–కనుమరుగవుతున్న జీవజాతులు
  • బయో-జియో-కెమికల్ సైకిల్’పై వేగవంతమైన మార్పులు–ఆవాస క్షీణతకు కారణం
  • జీవమనుగడపై పెను ప్రభావం–ఆహారపు గొలుసు నుండి ప్రత్యుత్పత్తి దాకా క్షీణత
  • సుస్థిర అభివృద్ధి మార్గమే–జీవవైవిద్య స్థిరత్వం
  • ఆవరణాల సుస్థిరతే ధ్యేయం–నిరోధక అభివృద్ధి ప్రయోజనకారి కాదు
  • సూక్ష్మస్థాయి అవగాహన–ఆవాస రక్షణకు కార్యాచరణ ప్రణాళిక
  • ప్రపంచ పౌరుల బాధ్యత–విశ్వమానవ ప్రయత్నంతోనే భౌమ్యావరణ ఆరోగ్యం
  • నిస్వార్థ జీవనం–రేపటి భవిష్యత్తు కోసం
  • కృత్రిమ జీవన ప్రయాణం–ముందుతరాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే
  • అవసరానికి మించిన వనరుల వాడుక–జీవవైవిధ్యానికి విఘాతం
  • ప్రకృతి రక్షణ సిద్ధాంతం–ప్రతి జీవికి సమాన హక్కు అనే ఆలోచనతో ముందుకు
  • ఆవరణ వ్యవస్థల ఆరోగ్యమే – జీవమనుగడకు యోగ్యం

పర్యావరణ వ్యవస్థలలో శిలావరణ వ్యవస్థ, వాయు ఆవరణ వ్యవస్థ (భౌమ్యావరణ వ్యవస్థ), జలావరణ వ్యవస్థ.. సముద్ర ఆవరణ వ్యవస్థలు అన్ని కలుపుకొని అన్ని జీవులకు అనుకూలమైన (మొక్కలకు, జంతువులకు (స్థూల, సూక్మజీవులు)) జీవావరణ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ వ్యవస్థలలో సజీవ, నిర్జీవ ఘటకాలు ఉండి పరస్పర చర్యలో ఏర్పడిన వ్యవస్థలుగా ఒక జీవావరణ వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.

 

ఆవరణ వ్యవస్థ అనేది జీవులు తమ పర్యావరణంతో బయోటిక్, అబియోటిక్ భాగాలు, పోషక చక్రాలు, శక్తి ప్రవాహాల ద్వారా కలిసి ఉంటాయి. ఈ వ్యవస్థలలో ఒకదానికొకటి సహకరించుకొని బలమైన ఆవరణ వ్యవస్థగా రూపుడిద్దుకొంటాయి.

సూక్ష్మంగా పరిశీలిస్తే పగడపు దిబ్బ పర్యావరణ వ్యవస్థలు అధిక ఉత్పాదక సముద్ర వ్యవస్థలు. ఎంతో గొప్ప జీవన అనుకూలనాలుగల ఈ భౌమ్యావరణం మానవుని కృత్రిమ చర్యల వలన తమ వివిధ ఆవరణ వ్యవస్థల గుణాలను, సహజ తత్వాన్ని కోల్పోతున్నాయి.

దీనివల్ల వివిధ ఆవరణ వ్యవస్థసలు జీవుల జీవనానికి ప్రతికులంగా మారి ఆవరణాల సుస్థిరతకు, జీవావరణ సమతుల్యానికి భంఘం వాటిల్లి జీవజాతుల మనుగడలేకుండా పోయి విలుప్తమవుతున్నాయి.

ఇలా జరుగకుండా ఉండాలంటే మానవుడు ఆవరణవ్యవస్థలను అర్ధంచేసుకొని వాటి మనుగడను కాపాడుకోవాలి. అప్పుడే అన్ని జీవులు వాటి ధర్మాన్ని నిర్వర్తించి జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటాయి.

ఆవాసాల రక్షణ ప్రపంచ పౌరుల బాధ్యత:
ఆవాసాల సంరక్షణ అనేది ఒక అంతర్గత సమ్మేలిత చర్యలచే ప్రపంచ వ్యాప్తంగా విశ్వమానవ ప్రయత్నంగా అందరు కలిసి మాత్రమే చేపట్టవలసిన బాధ్యతతో కూడుకున్న పని. అప్పుడు మాత్రమే భౌమ్యావరణం ఆరోగ్యంగా ఉండి అన్నిజీవులకు సుస్థిరమైన జీవనాన్ని ఇవ్వగలవు. ఇందుకోసమే ప్రపంచమే వేదికలు అనేకదేశాల కలయిక కూటములు ఏర్పాటు చేసుకొని రకరకాలైన పర్యావరణ సమస్యల మీద ఎన్నో ప్రణాళికలు, పరిశోధనలు జరుపుతూ పరిష్కారం మార్గ రచనలు, కార్యాచరణ కార్యక్రమాలు చేపడుతున్నారు.

అనేక ఆవరణాలలో సమస్యలను గుర్తించి వాటికిపరిష్కార మార్గాలాను కనుగొని కార్యరూపం ఇస్తున్నారు. అయితే ఈ సందర్భంలో ఆవాస రక్షణకై స్వీయ, సామాన్య ప్రజల, ప్రభుత్వాల, అధికారుల, శాస్త్రజ్ఞ్యుల, పరిశోధకుల, స్వచ్చంద సంస్థల దశ, దిశా ప్రతీది అర్ధం చేసుకొని ముందుకెళ్లే కార్యాచరణ, శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి అంటూ ఒక్క మానవీయా వలయంలో ఒక్క మనిషికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, మానవ కేంద్రంగా మాత్రమే అభివృద్ధి జరుగుతోంది. ఇది ఏ ఆవాస సహజత్వానికైనా ప్రమాదకరమే.

కారణలెన్ని చెప్పుకున్నా మానవుని కృత్యాలతో ప్రకృతి, పర్యావరణ, సహజవనరులపై అజమాయిషీ, అక్రమ ఆక్రమణ, విధ్వంసాల చర్యలకు ఎన్నో సజీవ, నిర్జీవ ఘటకాల మధ్యలో ఏర్పడే అసమతుల్యత వలన ఎన్నో జీవజాతులు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. ఆవాసం ఏదైనా మానవ కుత్రిమ చర్యల వలన (ఆంత్రపోజెనిక్ ఆక్టివిటీస్) బయో జియో కెమికల్ సైకిల్ సహజ చక్రంలో మార్పులు అతివేగవంతంగా (రాపిడ్లీ) జరుగుతోంది. దీని ప్రభావం వలన ఆ ప్రభావిత ఆవాసం తన సహజత్వాన్ని కోల్పోతోంది.

ఈ కారణాలే ఆ ఆవాస క్షీణనతకు ముఖ్యకారణం. ఈ ప్రభావం సంబంధిత ఎకోసిస్టం యొక్క సజీవ, నిర్జీవ ఘటకాలను నిర్వీర్యం చేస్తూ ఆ ఆవాస మనుగడ అంటే జీవమనుగడ (ఫ్లోరా, ఫౌణ) పై మార్పును చాలా వేగవంతంగా చూపిస్తుంది.

జీవుల క్షీనతకు దారితీస్తుంది. ఈ మార్పు జీవుల పుట్టుక, వాటియొక్క పోషణ, ఆహారపు గొలుసు, ఆహారపు వల, వాటి భిన్నమైన నివాసం, పెరుగుదల అభివృద్ధి, ప్రత్యుత్పత్తి, క్షీనత పై ప్రభావం చూపుతుంది, జీవ మనుగడ తలకిందులవుతుంది. అన్ని ఆవరణాలలో (భౌమ్య, జల, వాయు, జీవ ఆవరణాలు) సహజవనరుల, జీవుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.

అభివృద్ధి అవసరమే, అభివృద్ధిని ఎవరం కాదనలేం, నిజమే అది తీసిపారేయలేని వాస్తవం కానీ, శాస్త్ర, సాంకేతికత, అభివృద్ధి ఏదైనా జీవమనుగడకు అడ్డంకి కాకూడదు. ఏదైనా ఒక ఆవరణం, ఆవాస విధ్వంసాలకు, వాటిలో జీవమనుగడకు నిరోధమైన అభివృద్ధి అభివృద్ధి ఎలా అనిపించుకుంటుంది? అలా మనవేతర జీవుల మనుగడను విస్మరించి అభివృద్ధి జరుపుతూపోతే చివరికి మానవుడు మాత్రమే మిగిలిపోతాడు.

మరి మిగిలిన జీవులు అంతరించిపోయిన తర్వాత పర్యావరణ సుస్థిరత ఎలా సాధ్యమో ఆలోచించుకోవాలి. మానవుడు చేయాలనుకునే ప్రతీ ప్రణాళికా, అభివృద్ధి ఏదైనా ఒక్క మానవ సుఖానికి, వారియొక్క అభివృద్ధి కొరకుమాత్రమే కాకుండా అన్ని ఆవరణాలలోని అన్ని ఆవాసాల జీవరాశియొక్క మనుగడను, వాటి సుస్థిరతను కలుపుకొని మాత్రమే అభివృద్ధి జరగాలి.

సూక్ష్మస్థాయికి వెళ్లి అర్ధంచేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అలా అర్ధంచేసుకున్నపుడే ఆవాస రక్షణార్దం మనం ఎలాస్పందించాలో, భవిష్యత్తులో వాటిరక్షానకోసం మనవంతు బాధ్యత, కర్తవ్యం ఏమిటో, మనం ఏంచెయ్యాలో, ఎక్కడినుండి మొదలు పెట్టాలో ఏ ప్రణాళిక ఎలా తయారుచేసుకోవాలో అర్ధమవుతుంది. అప్పుడు మాత్రమే మిగతా జీవులతోపాటు మనిషి మనుగడ సాగించగలడు.

నిస్వార్ధ పర్యావరణ జీవనం ఎంతో అవసరం: మనిషి తమ సుఖసౌలభ్యం కోసం కుత్రిమ జీవన ప్రయాణం సాగిస్తున్నాడు. జీవపరిణామ సిద్ధాంతాన్ని సైతం లెక్కచేయక పర్యావరణ ఆధిపత్యధోరణి అవ్వాజంభించి అనేక పర్యావరణ కాలుష్య సమస్యలు, కుత్రిమ చర్యలద్వారా సహజ విపత్తులకు కారణభూతుడే కాకుండా జీవవైవిధ్యానికి విఘాతం ఏర్పరచి అనేక సమస్యలను కోరితెచ్చుకొని బాధలను అనుభవిస్తున్నాడు ఒక్కొక్కరారి తామేకాక చుట్టువున్న జీవవైవిధ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాడు.

 

ప్రకృతి ఈ కుత్రిమ ప్రయాణంలో తమ సుఖ జీవనమే, తమస్వీయానందమే కేంద్రంగా ముందుతరాల సహజ జీవన విధానాన్ని మరిచి పర్యావరణ విఘాతం కలిగిస్తూ ప్రస్తుతం అవసరానికిమించి విచ్చలవిడిగా వనరుల వాడుక (కనీస అవసరాలకుమించి) అతిగా వాడుతూ రేపటితరాలకు మిగిల్చకుండా భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ అనాలోచితంగా వనరులను ఇప్పుడే మింగేస్తున్నాడు.

సహజ వనరులను, ఆవరణాలను కాలుష్యకొరల్లోకి నెట్టేస్తూ ఆవరణ వ్యవస్థల మనుగడకు అవరోధం కలిగిస్తున్నాడు. ఇలా చేస్తుపోతే జీవమనుగడ ఆగిపోతూ అసలు జీవమే లేకుండా పోతుంది. ఆ ఆగిపోయే జీవంలో మానవుడే మొదటి స్థానంలో ఉంటాడు.

 

పర్యావరణ సమస్యలను సొంత కుత్రిమ చెర్యలతో కాకుండా పర్యావరణహింతంగా తమ జీవనాన్ని కొనసాగించుకోవాలి. అలా ఉండాలంటే, అదే జరగాలంటే ఏ ఆవరణ వ్యవస్థలోనైనా, ఆవరణంలోనైనా, ఏ ఆవాసంలోనైనా మానవుడు ప్రకృతి, పర్యావరణ, సహసజ వనరులను అర్ధంచేసుకొని సహజత్వాన్ని పునికిపుచ్చుకొని సహజ జీవనానికి కట్టుబడి జీవిస్తూ ప్రకృతి రక్షణ సిద్ధాంతాన్ని అర్ధంచేసుకొని ముందుకెళ్లాలి.

పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపి ఆవరణ ఆవాస అభివృద్ధికి పాటుపడాలి. మానవుడు స్వార్ధం విడిచి “ఈ భూమిపై ఉన్న అన్ని ఆవరణాల ఆవాసాలు అన్ని జీవులకు సమానమని, ఈ భూమిపై అన్ని జీవులకు సమానమైన జీవించే హక్కు ఉందనే ఆలోచనతో ఉందుకు సాగాలి. ప్రతీ పౌరుడు ప్రపంచ క్షేమమే తమ ధ్యేయంగా, పర్యావరణ సమతుల్యతదిశగా అలోచించి నిజజీవిత ప్రవర్తన మార్చుకొని, ప్రకృతి పర్యావరణ రక్షణకు అనుకూలంగా ప్రవర్తిస్తూ జీవించడం అలవాటు చేసుకోవాలి.

అలా మనిషి తమను తాము ప్రకృతి సహజ సిద్దతకు అనుకూలంగా మార్పు చేసుకొని జీవించినప్పుడే ఈ భూమిపై జీవమనుగడ కొనసాగుతుంది. అదే ఈ భూమికి, ఆవరణ వ్యవస్థలకు, అన్ని జీవులకు సుభిక్షం, సురక్షితం.

రవిబాబు పిట్టల, ఫార్మర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఎన్టీయూహెచ్, జాయింట్ సెక్రెటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ.

 

 

 

ఎకోటూరిజం హబ్‌గా ఇనుపరాతి గుట్టలు..: దేవునూరు సర్పంచ్ అభ్యర్థి సందీప్ హామీలు