= కుటుంబానికి పరామర్శ
వేద న్యూస్, బోయినిపల్లి:
చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యక్తిగత సహాయకుడు అనంతోజి మోహన్ తండ్రి అనంతోజి రామకృష్ణ ఆచార్య ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం ఏడవ రోజు పలువురు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్యావ వెంకట్ రెడ్డి, వేద న్యూస్ రిపోర్టర్ మైలారం మహేష్, సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గూడ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.