•   శ్రావణ శుక్రవారం సందర్భంగా అధిక సంఖ్యలో హాజరు

వేద న్యూస్, వరంగల్ :

శ్రావణ మాసం వరలక్ష్మీవ్రతం శుక్రవారం సందర్భంగా భక్తులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి అమ్మవారికి చీరలు సమర్పించారు. భక్తులు ఉదయం నుండి అమ్మవారి దర్శనమునకు బారులు తీరారు.

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, మంచినీరు, ప్రసాద వితరణ ఏర్పాట్లు దేవాలయ చైర్మన్ డాక్టర్ బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్కుమార్ రెడ్డి, మోతుకూరి మయూరిరామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి, తొగరు క్రాంతి, ఓరుగంటి పూర్ణచందర్, పాలడుగల ఆంజనేయులు, బింగి సతీష్, అనంతుల శ్రీనివాస్ రావు, జారతి వెంకటేశ్వర్లులు పర్యవేక్షించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ముత్తయిదువలు వాయినాలు ఇచ్చుకున్నారు.

అమ్మవారిని వరంగల్ పశ్చిమ నియోజక వర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ దంపతులు దర్శించుకున్నారు. పూజానంతరం అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.