- 145 రకాల సీతాకొకచిలుకలు, చిమ్మట్ల గుర్తింపు!
వేద న్యూస్, వరంగల్:
తెలంగాణలో తొలిసారి బట్టర్ ఫ్లై, మాత్‌ల సర్వేను చేపట్టారు. అటవీశాఖ అధికారులతో కలిసి దట్ట మైన అటవీ ప్రాంతంలో ఉదయం, సాయంత్ర వేళల్లో వాటి సంచారాన్నిపర్యావరణ నిపుణులు పరిశీలించారు. బట్టర్ ఫ్లై, మాత్ సర్వే-2025 లో భాగంగా అభయారణ్యం, తాడ్వాయి, గోవిందరావు పేట, ఏటూరునాగారం మండలాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
పర్యావరణవేత్తలు, వాలంటీర్లు బృందాలుగా ఏర్పడి మేడారం, జలగ లంచ, లక్నవరం, పికాక్ గుట్ట, చింతలమోరీతో పాటు మరో ఎనిమిది ప్రాంతాల్లో సభ్యులు కాలినడక తిరిగి సీతాకోక చిలుకలను కెమెరాల్లో బంధించారు.
మొత్తం 145 రకాల సీతాకోక చిలుకలను, మాత్‌లను గుర్తించినట్లు తెలుస్తున్నది.
డీఎస్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్త చిత్ర శంకర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నాగేశ్వరరావు, శ్యాం సుందర్, రవిబాబు, పలు రాష్ట్రాలకు చెందిన 35 మంది నిపుణులు మొత్తం 53 మంది సర్వేలో పాల్గొన్నారు.