వేద న్యూస్, ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. హెల్త్ సూపర్‌వైజర్ బి హేమలత, హెచ్ఈఓ కృపాకర్, ఎమ్ఎల్‌హెచ్‌పి బి గణేష్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్‌వైజర్ హేమలత మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ వారోత్సవాలలో భాగంగా పుట్టిన వెంటనే గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, తల్లిపాలు పిల్లలకు రోగానిరోధక శక్తిని పెంచుతుందని వారు పేర్కొన్నారు. కాబట్టి పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పిల్లలకు పట్టించాలని అన్నారు.

గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించేందుకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం, అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎమ్ భవానీ, ఆశా వర్కర్లు వినోద, ప్రమీల, వనిత, అంగన్వాడీ టీచర్లు చిన్న గంగు, త్రివేణి, పద్మావతి, నీలిమ, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.