• సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ రాజేందర్
  •  అభ్యర్థి రామంచ సంపత్ ను గెలిపించాలని కోరిన మాజీ మంత్రి 
  • బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన.. 

వేద న్యూస్, ఇల్లందకుంట:

ఎంపీ ఈటల రాజేందర్ రాకతో ఇల్లందకుంట మండల పరిధిలోని గ్రామాల్లో బిజెపి కార్యకర్తలు నేతల్లో ఉత్సాహం నెలకొన్నది. హుజురాబాద్ అడ్డా ఈటల గడ్డ.. అని ఎంపీ వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనగర్తీ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సంపత్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పలుకుబడిని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మద్దతుతో గ్రామంలో రాజకీయం బాగా హీట్ ఎక్కింది. ఆయన వైపే మొత్తంగా జనం ముగ్గు చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రజాసేవకులకే ప్రజలు మద్దతు ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. శనివారం ఆయన ఇల్లందకుంట మండల పరిధిలోని కనగర్తీ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రామంచ సంపత్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.  గ్రామ పరిధిలోని ప్రజలతో కలిసి కొంత దూరం నడిచి… సర్పంచ్ అభ్యర్థి సంపత్ కు సపోర్టు చేయాలని జనాన్ని కోరారు. గ్రామ పరిసరాల్లో కలియదిరిగిన అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థి రామం చ సంపత్, వార్డు మెంబర్లుగా బరిలో నిలిచిన బీజేపీ బలపరిచిన వారిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి సంపత్ రామంచ, గ్రామ నాయకులు ,కార్యకర్తలు,  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

 సంపత్ గెలుపుపై కార్యకర్తల ధీమా

మొత్తంగా సర్పంచ్ ఎన్నికల తో గ్రామ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈటల రాకతో జోష్ నెలకొన గా, రాజకీయ సమీకరణాలు వేగంగా మారి ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో మద్దతు పెరుగుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు.

20 ఏళ్ల నుంచి తన వెంట నడుస్తున్న సంపత్ కు మద్దతు పెరిగేలా ఈటల రాజేందర్ ప్రచారం కచ్చితంగా దోహదపడుతుందని కార్యకర్తలు ధీ మా వ్యక్తం చేస్తున్నారు. కన గ ర్తి గ్రామ ప్రథమ పౌరుడిగా చక్కటి సేవలను సంపత్ అందిస్తారని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్పంచ్ గా సంపత్ గెలుపు ఖాయమని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.