•  కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ 

వేద న్యూస్, వరంగల్:

రాష్ట్రంలో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అంధకారం లోకి నెట్టిందని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.అదే పని గా మరోసారి మోసం చేసే ప్రయత్నం లో భాగంగా సీఎం రేవంత్ అబద్ధపు హామీలను పక్క రాష్ట్రాలలో ఎలక్షన్ ప్రచారం మొదలు పెట్టాడని పేర్కొన్నారు.

బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిల్లీ కేంద్రంగా నేషనల్ మీడియా ముందు లెక్కలతో సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసపు హామీలను ఎండగట్టారని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలిందని, దానితో అసహనానికి గురి అయిన రాహుల్ గాంధీ గట్టిగానే రేవంత్ కు మొట్టికాయలు వేశారని ఆరోపించారు.అదానీ విషయం లో కూడా రేవంత్ వెనక్కి తగ్గారని దుయ్యబట్టారు.