వేద న్యూస్, వరంగల్:
కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మైనాల నరేష్ ను ఎన్నుకున్నారు. కేటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ నియమకపత్రాన్ని నరేష్ కు అందజేశారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు, నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి, నియొజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు, సొషల్ మీడియా అధ్యక్షులు జన్నే శ్రీకంత్, సిరిసిల్ల నియొజకవర్గం ముస్తాబాద్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.