- అంధకారంలో అంగన్ వాడీ కేంద్రం..
వేద న్యూస్, వరంగల్ :
గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రామేశ్వర టెంపుల్ అంగన్ వాడీ కేంద్రం లో గత వారం రోజులుగా కరెంట్ లేక అవస్థలు పడుతున్నారు..

విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం గా కనిపిస్తోంది..! చీకట్లో చిన్నారులకు విద్య అందుతుండటం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.