- తీవ్రంగా దెబ్బతిన్న కోనరావుపేట, చందుర్తి మండలాలను కలిపే రహదారి
- ప్రజలకు తీవ్ర ఇక్కట్లు
వేద న్యూస్, కోనరావుపేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి మండలానికి వెళ్లే ప్రధాన మార్గం దెబ్బ తిన్నది.
వర్షాలు రావడంతో మూల వాగు ప్రవాహంతో రోడ్లు కొట్టుకపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కోనరావుపేట, చందుర్తి. రెండు మండలాలను కలిపే ఈ రహదారి, అలాగే వేములవాడకు వెళ్లే ప్రధాన రహదారి, కోనరావుపేట మండల కేంద్రానికి వెళ్లే దారీ తీవ్రంగా దెబ్బతిన్న ది.
ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు
లోలెవెల్ వంతెన పూర్తిగా దెబ్బతిని వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు.
ప్రతిరోజూ వందలాది వాహనాలు, ముఖ్యంగా వేములవాడకు వెళ్లే వాహనదారులు ఈ మార్గం మీదనే వెళ్తుంటారు.
అయితే మూలమలుపులు, వంతెనల దగ్గర రహదారి పూర్తిగా కోతకు గురవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పలుమార్లు రిపేర్ చేసినా ప్రతీ ఏడాది వర్షాలు రావడంతో మూల వాగు ప్రవాహానికి రహదారి కొట్టుకపోయి ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలకు సురక్షిత రవాణా కల్పించాలని రెండు మండలాల ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ప్రజా ప్రభుత్వం లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం కాదు.. చేతల్లో పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.