వేద న్యూస్, వరంగల్:
సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరీర దానానికి ముందుకు వచ్చిన హన్మకొండ జిల్లా జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు నాగవెల్లి అశోక్,రామంచ బిక్షపతి లను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(IAS), DRO గణేష్ అభినందించారు.
హన్మకొండ నివాసులు,జన విజ్ఞాన వేదిక హన్మకొండ జిల్లా నాయకులు అయిన నాగవల్లి అశోక్ (అకౌంటెంట్),రామంచ బిక్షపతి ( టీచర్ ), తెలంగాణ ముద్దుబిడ్డ శరీర,నేత్రదాత అయిన “కాళోజీ ” స్పూర్తితో,సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరువురు శరీర, అవయవ దానానికి ముందుకు వచ్చారు .
ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను కే ఎం సి వరంగల్ వారికి వారికి సమర్పించగా.. వారు ఇచ్చిన సర్టిఫికెట్ మరియు సదాశయ ఫౌండేషన్ అభినందన పత్రం హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్( IAS) చేతులమీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణానంతరం ఉపయోగపడే శరీరం, అవయవాలు మట్టిలో వృథా పోనీయకుండా దానం చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రశంసించారు. అలాగే హన్మకొండ DRO వై.వి.గణేష్ గకూడా శరీరదాన నిర్ణయాన్ని కొనియాడారు. సమాజహిత దేహదాన నిర్ణయం ప్రశంసిస్తూ సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, సలహాదారులు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి,కె.పురుషోత్తం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో కో ఆర్డినేటర్ దళపతి, హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.శంకర్రావు, సదానందం , వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేణుమాధవ్, కుమారస్వామి, ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ మరియు కిట్స్ కాలేజీ రిజిస్టార్ కోమల్ రెడ్డి, కెమిస్ట్రీ విభాగ అధిపతి డాక్టర్ డి.ప్రభాకరాచారి అభినందనలు తెలిపారు.
రామంచ బిక్షపతి SA ఇంగ్లీష్ ZPHS బాలురు ముల్కనూర్ ను…JVVప్రధానకార్యధర్షి హనుమకొండని , ZPHS బాలురు ముల్కనూర్ HM పోలినేని రవిప్రకాష్, ఉపాధ్యాయ బృంద సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
