వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:

జూనియర్ చాంబర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ (JCI) మంచిర్యాల్ చాప్టర్, ప్రతీ సంవత్సరం వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి అవార్డులను అందజేస్తోంది. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన అవార్డును పర్యావరణ వేత్త పిట్టల రవిబాబుకు ఆదివారం అందజేసింది. సొసైటీకి అద్భుతమైన సేవా సహకారం, సేవాలు అందిస్తున్న వారికి ప్రోత్సాహంగా అవార్డులను ఈ సంస్థ ఇస్తోంది.

ఆదివారం అవార్డు ప్రధానోత్సవం జరిగింది. పర్యావరణ సేవలు, పర్యావరణ పరిరక్షణ విభాగంలో భాగంగా రవిబాబు పిట్టల ను స్వచ్ఛందంగా గుర్తించి  ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రదానం చేశారు.

ఈ సందర్బంగా డా.రాజు ఆరుమోళ్ల మట్లాడుతూ ఏ స్వార్థం, స్వలాభాపేక్షలేకుండా పర్యావరణాన్ని, సహజ వనరులను కాపాడుటలో నిర్విరామంగా కృషి చేష్టూ, పర్యావరణ ఉద్యమాలను నిర్మించడం, పర్యావరణవేత్తలను ప్రోత్సహించడం, ఫలితాలను సాధించడం, పర్యావరణ కాలుష్యం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవగాహన, అటవీ నిర్మూలన, భూమి క్షీణత, వన్యప్రాణుల అక్రమ రవాణాపై అవగాహనను రవిబాబు కల్పిస్తున్నారని చెప్పారు.  వన్యప్రాణుల అక్రమ వేట, అక్రమ అటవీ ఆక్రమణ (పోడు), ఇసుక, నీరు, మట్టి మరియు ఇతర అక్రమ రవాణా వంటి మానవజన్య కార్యకలాపాలకు వ్యతిరేకంగా పిట్టల విప్లవం తీసుకువస్తున్నాడని వెల్లడించారు.

రేపటి మంచి తర్వాతి తరం కోసం జీవిత ఉనికి కోసం పర్యావరణ పరిరక్షణ, ఉత్పత్తి సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడమే రవిబాబు లక్ష్యమని తెలిపారు.  అదేవిధంగా పర్యావరణ రక్షణలో బాగా పర్యావరణ విద్య మాత్రమే తక్షణ కర్తవ్యమని విద్యార్థులకు వివిధ కార్యక్రమల ద్వారా విద్యార్థి వయస్సు నుండి ప్రకృతి విద్యలో పాటలు నేర్పుతున్నారని కొనియాడారు. పర్యావరణ వేత్త రవిబాబు కష్టపడి పనిచేస్తున్నారని, అనేక స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో ముందుకెళుతూ పర్యావణాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్నారని సభలో కొనియాడారు.

అవార్డు గ్రహీత రవి బాబు పిట్టల మాట్లాడుతూ ఇంత ప్రతిష్టాత్మక మయిన అవార్డుకు ఎంపిక చేసి ఇచ్చి తనకు ఇచ్చినందుకు అంతర్జాతీయ సంస్థ అయిన జేసీ, మంచిర్యాల అధ్యాయం సంస్ధకు కృతజ్ఞతలు  తెలిపారు. ఈ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్‌లు తనకు ప్రోత్సాహం ఇచ్చాయని చెప్పారు. తాను పర్యావరణానికి ఎంతో బాధ్యత, ప్రాధాన్యత ఇస్తానని ఆనందంగా చెప్పారు.