వేద న్యూస్, వరంగల్:

నెక్కొండ మండలం సూరిపెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం చైర్మన్ గంట దామోదర్ రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. 

కార్యక్రమం లో వైస్ చైర్మన్ నరేష్ రెడ్డి , సొసైటీవైస్ చైర్మన్ బరుగు విజయ, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, మార్కెట్ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ లు పిట్టల లక్ష్మి, సల్మాది యశోద, గాదె భద్రయ్య, చార్ల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.