వేద న్యూస్, పాపన్నపేట :
మండల కేంద్రంలోని పాపన్నపేట గ్రామ పంచాయతీలో సోమవారం ఉపాధి హామీ పనులను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు కూలీలందరికీ ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని,అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించి,ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్, దోసని సంగమేశ్వర్, వార్డ్ మెంబర్లు ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, కాంగ్రెస్ నాయకులు,ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు