వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గ్రామాల్లో టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు. మర్రిపల్లిగూడెంలోని శ్రీ సిద్ధి వినాయక యూత్ మండపం వద్ద  జనసేన కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం కేక్ కట్ చేసి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయిలో పవన్ ఉండాలని, ఆయన అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుంటున్నట్లు తెలిపారు.జన్మదిన వేడుకల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,మహిళలు,చిన్నారులు పాల్గొన్నారు.