వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంగళవారం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యుడిగా సేవలు ప్రారంభించి.. ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఒక రూపాయికే వైద్యం అందించి.. పేద ప్రజలకు వైద్యం అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పారు. 1978 లో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారనీ వెల్లడించారు. వైయస్ “పీపుల్స్ లీడర్”గా పేరుగాంచారనీ స్పష్టం చేశారు.

1999–2004లో ఆంధ్రప్రదేశ్ లీడర్‌ ఆఫ్‌ అప్పోజిషన్‌గా ఎంతో చురుకైన పాత్ర పోషించి.. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారనీ గుర్తు చేశారు.ఫ్రీ ఎలక్ట్రిసిటీ (రైతులకు మొదటే రోజు నుంచి), “రాజీవ్ ఆరోగ్యశ్రీ” మెడికల్ స్కీం, ఇందిరమ్మ హౌసింగ్, పింఛన్ల పెంపు, ఫీ రీయంబర్స్మెంట్, 108, మొదలైన పలు గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు.

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన శాంతి దూత కూడా ఆ మహానేతనే అని గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో ఇల్లందకుంట రామాలయ దేవస్థానం చైర్మన్ ఇంగిలేరామారావు మార్కెట్ డైరెక్టర్ ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, గూడపు సారంగపాణి, కనుమల్ల సంపత్, ఎక్కేటి సంజీవరెడ్డి, కనుమల్ల రామకృష్ణ, వంగ రామకృష్ణ, పెద్ది శివకుమార్, గుడిశాల పరమేశ్వర్, బొమ్మ శ్రీనివాస్, మూడెత్తుల మల్లేష్, మోతేమహేందర్ , మీసా రాజయ్య, మరి వీరారెడ్డి, మేడద తిరుపతిరెడ్డి, మూరెడ్ల రమేష్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.