వేద న్యూస్, సినిమా:
తెలుగు చిత్ర సీమలో నటులకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా అగ్రనటులకు అయితే వీరలెవల్ పాలోయింగ్.. వాళ్లను దైవాలుగా అభిమానాలు, సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఆరాధిస్తుంటారు. ఆ కోవకు చెందిన నటుల్లో తప్పకుండా ఉండేవాళ్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు.
దాదాపుగా ఒకే సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన వారిలో వీరు ఉంటారు. పవన్ కల్యాణ్ కొంత ముందుగా రాగా, ఆ తర్వాత వచ్చిన మహేశ్.. ఇద్దరూ తమ వారసత్వాన్ని నిలబెట్టి అగ్రనటులుగా ఎదిగారు. ఇక ఫ్యాన్ పాలోయింగ్.. లో మా హీరో నే నంబర్ వన్.. అంటూ ఇరువురు హీరోల అభిమానుల సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో చర్చలు జరుపుతుంటారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. ఇరువురు కలిసి ఒకే చోట ఓ వేదిక పంచుకోవడం విశేషం.
మహేశ్ బాబు, గుణశేఖర్ కాంబోలో తెరకెక్కిన ‘అర్జున్’ చిత్రం విడుదల తర్వాత పైరసీ వల్ల ఇబ్బందులకు గురయింది. ఈ సంగతి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. వెంటనే చిత్ర యూనిట్ కు మద్దతు తెలిపారు. ‘బద్రి’ ఫిల్మ్ షూటింగ్ నుంచి వచ్చి.. మహేశ్ బాబును… ‘అర్జున్’ సినిమా యూనిట్ ను కలిసి తన మద్దతును బహిరంగంగా తెలిపారు. ఈ సంగతి ఓ ఇంటర్వ్యూలో మహేశ్ సోదరి వెల్లడించారు.
కాగా, తమ అభిమాన నటులు మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ .. పైరసీ వ్యతిరేక పోరులో కలిసి ముందుకు నడిచారనే సంగతి తెలిస్తే అభిమానగణం సంతోషపడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమా, పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తూనే.. మరో వైపు చిత్రాల్లోనూ నటిస్తున్నారు. మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు.