•  పులి మేధస్సు అనేది కేవలం భౌతిక శక్తికి సంబంధించింది మాత్రమే కాదు, అది ఒక సంక్లిష్టమైన మనుగడ వ్యూహం కలది
  •  పులి కేవలం ఒక క్రూర మృగం కాదు, అది పర్యావరణ వ్యవస్థ యొక్క సమతుల్యతను కాపాడే ఒక వ్యూహాత్మక మేధావి
  •  మానవ-వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించాలంటే పులి యొక్క ఈ మేధోపరమైన ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం
  •  పులి ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉండి అటవీ ఆవరణ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది

రాయల్ బెంగాల్ టైగర్:

భారతీయ బెంగాల్ రాయల్ టైగర్ (పాంతేరా టైగ్రీస్ టైగ్రీస్) భారతదేశీ య గంభీరమైన గర్వంన్నిచ్చే అందమైన మాంసాహార జంతువు. జీవన విధానం మరియు ఆవాసం బెంగాల్ టైగర్ ప్రధానంగా భారత ఉపఖండంలోని ఉష్ణమండల వర్షారణ్యాలు, మడ అడవులు (సుందర్బన్స్), మరియు పొడి ఆకురాల్చే అడవులలో నివసిస్తుంది. వీటి మనుగడకు ముఖ్యంగా మూడు అంశాలు అవసరం. అవి తగినంత వేట (ప్రే బేస్డ్), నీటి లభ్యత, మరియు దట్టమైన వృక్షసంపద కలిగిన అటవీ ఆవాసం. అదేవిధంగా గడ్డిమైదానం, మంచి దాగివుండే నిచే గల బండారళ్ళు, గుహలు కలిగిన ప్రదేశాలు వీటి జీవనానికి నిలయాలు. పులులు తమ చర్మంపై ఉండే చారల ద్వారా అడవిలో మభ్యపెట్టే (కామౌఫ్లాజ్) అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రతి పులికి ఉండే చారలు మనిషి వేలిముద్రల మాదిరిగా విభిన్నంగా ఒక్కదానినుండి ఇంకొకటి వేరుగా ఉంటాయి.

తెలివైన వ్యూహాత్మక మేధస్సు మరియు వేట (ఇంటలిజెన్స్ మరియు హంటింగ్)

పులి ఒక ‘సాలిటరీ హంటర్’ (ఒంటరి వేటగాడు). ఇవి సింహాల వలె గుంపులుగా వేటాడవు, కాబట్టి వీటి తెలివితేటలు అత్యంత కీలకం. హంటింగ్ స్ట్రాటజీ భిన్నంగా ఉంటింది. పులి తన ఆహారాన్ని వెంబడించేటప్పుడు గాలి వీచే దిశను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది, తద్వారా తన శరీరం నుండి వచ్చే వాసన వేట జంతువుకు తెలియకుండా చూసుకుంటుంది. ముందుగా తన రిస్క్ అసెస్మెంట్ తీసుకొని మాత్రమే ఇవి వేట కోసం వెచ్చించే శక్తి (ఎనర్జీ కాస్ట్) మరియు దాని వల్ల కలిగే ప్రమాదాన్ని (రిస్క్) నిరంతరం అంచనా వేస్తాయి. గాయపడితే వేటాడటం కష్టమవుతుందని తెలిసిన పులి, బలమైన ఎద్దు లేదా అడవి పంది ఎదురుదాడికి దిగితే వేటను వదిలిపెట్టి వెనక్కి తగ్గుతుంది.

టెరిటరీ (ప్రాంతం) సృష్టి మరియు పోరాటాలు

పులులు తమకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని (టెర్రిటరీ) ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం అవి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను ప్రదర్శిస్తాయి. అందులో ముఖ్యమైనది మార్కింగ్ తో పులులు తమ భూభాగాన్ని మూత్రం (సెంట్ మార్కింగ్), చెట్లపై గోళ్లతో చేసే గీతలు (స్క్రాచింగ్), మరియు గర్జనల ద్వారా గుర్తిస్తాయి. పులి ఎక్కువగా భయము లేకుండా కోపోద్రికంగా (అగ్రెసివ్‌నెస్) కలిగివుంటూ మగ పులి సుమారు 60 నుండి 100 చదరపు కిలోమీటర్ల వరకు విస్తీర్ణాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. ఈ భూభాగంలోకి మరో మగ పులి వస్తే తీవ్రమైన ఘర్షణలు జరుగుతాయి. ఇవి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. అయితే, ఆడ పులుల భూభాగాలు మగ పులి భూభాగంతో కలిసి ఉండవచ్చు.

పులి ఒక టెరిటరీ నుండి వెళ్ళిపోవడానికిగాలా కారణాలు

పులి తన ప్రాణప్రదమైన భూభాగాన్ని (టెర్రటరీ) వదిలి వెళ్ళిపోవడానికి ప్రధానంగా మనుగడ మరియు ఆధిపత్య పోరాటాలే కారణమవుతాయి. ఒక మగ పులి తన సామ్రాజ్యంలో ఆహారం (ప్రే) కొరత ఏర్పడినప్పుడు లేదా నీటి వనరులు ఎండిపోయినప్పుడు కొత్త ప్రాంతాల వేటలో భాగంగా తన టెరిటరీని వదిలివేస్తుంది. అలాగే, వయసు పైబడినప్పుడు లేదా గాయపడినప్పుడు, యువ మరియు బలమైన మగ పులులతో జరిగే భీకర పోరాటాలలో ఓడిపోతే, అది తన ప్రాంతాన్ని కోల్పోయి సురక్షితమైన మరో చోటికి వలస వెళ్లాల్సి వస్తుంది. ఆడ పులుల విషయంలో అయితే, తన పిల్లల రక్షణ కోసం లేదా పెరిగిన పిల్లలు సొంతంగా భూభాగాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో తల్లి పులి పక్కకు తప్పుకోవచ్చు. వీటితో పాటు అడవుల నరికివేత, మానవ సంచారం పెరగడం మరియు రోడ్ల వంటి అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా పులులు తమ సహజ ఆవాసాలను వదిలి కారిడార్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిపోతుంటాయి.

పెద్ద పులి ప్రవర్తన (టైగర్ బిహేవియర్)

పెద్ద పులి ప్రవర్తన (టైగర్ బిహేవియర్) అనేది అత్యంత ఆసక్తికరమైన మరియు వైజ్ఞానికపరమైన అంశం. పులులు తమ మనుగడ కోసం అద్భుతమైన తెలివితేటలను, క్రమశిక్షణను ప్రదర్శిస్తాయి. పులి ప్రవర్తనలో ముఖ్యమైన అంశాలు:

ప్రవర్తన అనుకూలత (బిహేవియరల్ అడాప్టషన్):

పులులు పరిస్థితులకు అనుగుణంగా తమ అలవాట్లను మార్చుకుంటాయి. సాధారణంగా నిశాచర జీవనం ఎక్కువగా సాగిస్తుంటాయి. పులులు పగలు, రాత్రి కూడా వేటాడతాయి. కానీ మానవ సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, అవి తమను తాము రక్షించుకోవడానికి కేవలం రాత్రిపూట మాత్రమే బయటకు వచ్చే ‘నిశాచర’ (నోక్టుర్నల్) జీవులుగా మారిపోతాయి. మానవ సంబంధాల నివారణలో భాగంగా పులులు సహజంగా మనుషులతో ఘర్షణను ఇష్టపడవు. అవి తెలివిగా మనుషులు లేని సమయాల్లో లేదా ప్రాంతాల్లో తమ కదలికలను సాగిస్తాయి.

వేట మరియు సహనశీలత (హంటింగ్ మరియు పేషెన్స్):

పులి తన ఆహారాన్ని వేటాడేటప్పుడు అత్యంత ఓర్పును ప్రదర్శిస్తుంది. ఎరకు (ప్రే) కనిపించకుండా (మభ్యపెట్టడం (స్టీల్త్/కామౌఫ్లాజ్)) పులులు తమ నక్కిన శరీరంతో శరీర రంగును చారలను అడవిలోని గడ్డి, చెట్ల నీడలతో కలిపివేస్తాయి. ఇవి పశువుల కాపరులు లేదా సంరక్షకులు ( ముఖ్యంగా ఎరయొక్క తల్లులు) పరధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తాయి. పులులు వేటాడే సమయంలో ఎనర్జీ కాస్ట్ అంచనా వేసుకొని ఒక జంతువును వేటాడటానికి ముందు, ఆ వేట వల్ల తనకు ఎంత శక్తి ఖర్చవుతుంది మరియు అందులో ఎంత ప్రమాదం ఉందో లెక్కవేస్తుంది. ఒకవేళ ప్రమాదం ఎక్కువని అనిపిస్తే, అది వేటను వదిలిపెట్టి వెనక్కి తగ్గుతుంది (రిస్క్ అసెస్మెంట్).

ప్రాదేశిక మేధస్సు (స్పేసియల్ మాపింగ్):

పులులు తమ ఆవాస ప్రాంతాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాయి. కారిడార్ల గుర్తింపువిషయంలో అక్కడి విచ్ఛిన్నమైన అటవీ ప్రాంతాల మధ్య కదలడానికి పులులు సురక్షితమైన “కారిడార్ల”ను గుర్తిస్తాయి. రోడ్లు, కంచెలు మరియు మానవ నివాసాలను దాటుకుంటూ ఎవరికీ కనిపించకుండా ప్రయాణించడంలో ఇవి నిష్ణార్థులు. పులులకు అపారమైన జ్ఞాపకశక్తి ఉంటుందని ఎన్నో శాస్త్రియ ఋజువులున్నాయి. ఒకసారి చూసిన మార్గాన్ని లేదా అడ్డంకిని (ఉదాహరణకు ఉచ్చులు లేదా కంచెలు) పులులు గుర్తిస్తాయి మరియు వాటిని ఎలా దాటవేయాలో (ప్రాబ్లెమ్ సాల్వింగ్) నేర్చుకుంటాయి.

మనుగడ ప్రవృత్తి (సర్వైవల్ ఇన్స్టింక్ట్):

పులి ప్రవర్తన కేవలం దూకుడు (అగ్గ్రెషన్) మీద ఆధారపడి ఉండదు. అది ‘లెక్కించిన మనుగడ’ (కాల్క్యూలేటెడ్ సర్వైవల్) మీద ఆధారపడి ఉంటుంది. గతంలో మానవులతో జరిగిన ఎన్‌కౌంటర్‌ల నుండి అవి పాఠాలు నేర్చుకుంటాయి, అందుకే పాత కాలపు పద్ధతులతో పులులను నియంత్రించడం కష్టమవుతోంది.

సంపర్కం (మేటింగ్, సంతానోత్పత్తి) మరియు బిహేవియర్

పులుల సంతానోత్పత్తి ప్రక్రియ మరియు వాటి ప్రవర్తన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, పులుల తమ సంభోగం (మేటింగ్) ప్రక్రియ కు సంబందించిన కొన్ని విషయాలలో ముఖ్యంగా మేటింగ్ ఫ్రీక్వెన్సీ విషయంలో ఆడ పులి ఎస్ట్రస్ చక్రం (సంభోగానికి సిద్ధంగా ఉన్న సమయం) లో ఉన్నప్పుడు, మగ పులి మరియు ఆడ పులి సుమారు 3 నుండి 7 రోజుల పాటు కలిసి ఉంటాయి. సుమారుగా ఒక్క ఈ సమయంలో, అవి చాలా తరచుగా సంభోగంలో పాల్గొంటాయి. ఒక మగ పులి రోజుకు సగటున 30 నుండి 50 సార్లు సెక్స్‌లో పాల్గొనగలదు.

ప్రక్రియ కాలపరిమితి చిత్రమనిపించినా అవి ప్రతి సంభోగ ప్రక్రియ చాలా తక్కువ సమయం, అంటే సుమారు 15 నుండి 30 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో శబ్దం మరియు ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంటుంది. శంభోగ ప్రక్రియ సమయంలో పులులు గట్టిగా గర్జిస్తాయి మరియు ఆడ పులి కొన్నిసార్లు మగ పులిపై దూకుడుగా ప్రవర్తించవచ్చు. సంభోగం ముగిసిన వెంటనే ఆడ పులి మగ పులిపైకి తిరగడం సహజం. సంతానోత్పత్తి సక్సెస్ రేట్ అనగా పులులలో అండం విడుదల కావడానికి (ఓవులేషన్) పదేపదే సంభోగం జరగడం అవసరం. అందుకే అవి తక్కువ వ్యవధిలో ఇన్ని సార్లు పాల్గొంటాయి. సంభోగం సమయంలో మాత్రమే మగ మరియు ఆడ పులులు కలిసి ఉంటాయి. ఆడ పులి సుమారు 103 రోజుల గర్భావధి కాలం తర్వాత 2 నుండి 4 పిల్లలకు జన్మనిస్తుంది. పిల్లల పెంపకంలో మగ పులి పాత్ర ఉండదు. తల్లి పులి తన పిల్లలకు వేట మెళకువలను మరియు శత్రువుల నుండి ఎలా తప్పించుకోవాలో దాదాపు రెండేళ్ల పాటు నేర్పిస్తుంది.

కారిడార్లు మరియు జన్యు వైవిధ్యం (కార్రిడార్స్ మరియు జనటిక్స్)

అడవులు విచ్ఛిన్నం కావడం (ఫారెస్ట్ ఫ్రాగ్మెంటేషన్) వల్ల ఒక అడవి నుండి మరో అడవికి వెళ్లడానికి పులులు “కారిడార్ల”ను ఉపయోగిస్తాయి. వీటిలో జన్యు వైవిధ్యం ముఖ్యంగా కారిడార్లు ( ఒక ప్రాంతంనుండి ఇంకొంప్రాంతానికి వెళ్లే మార్గాలు) లేకపోతే ఒకే ప్రాంతంలోని పులుల మధ్య ప్రజననం (ఇన్ బ్రీడింగ్) జరిగి జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయి.

ఈ సమస్యల ఫలితంగానే అన్-సీన్ జీన్స్ & కాల్బునిజం: పులులలో అరుదుగా కనిపించే “వైట్ టైగర్” స్థితి (ల్యూసిసుమ్/ఆల్బయినిజం) అనేది ఒక రిసెసివ్ జన్యువు (రిసెసివ్ జీన్) వల్ల కలుగుతుంది. ఇది సాధారణ రంగు పులులలో కూడా “అన్-సీన్” (కనిపించని) స్థితిలో ఉండవచ్చు. ఇక వీటిలో కాల్బునిజం వలన ఇక్కడ పులుల రంగు మార్పు లేదా ప్యూమిలానిజం వంటి మార్పులు జన్యుపరమైన ఉత్పరివర్తనాల వల్ల సంభవిస్తాయి.

ఆకస్మాత్తుగా పులి ఎదురైతే ఏంచేయాలి? అడవిలో లేదా పులి సంచరించే ప్రాంతాల్లో పొరపాటున పులి ఎదురైతే, ప్రాణాపాయం నుండి తప్పించుకోవడానికి నిపుణులు సూచించే కొన్ని కీలకమైన జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాల్సివుంటుంది ముఖ్యంగా

పులి ఎదురైనప్పుడు చేయవలసినవి (డూస్) ఏమిటంటే:

ముందుగా కదలకుండా నిశ్చలంగా ఉండాలి. పులిని చూడగానే భయంతో పరిగెత్తకూడదు. మనం పరిగెత్తితే పులి మనల్ని ‘వేట’ లేదా ఎర (ప్రే) గా భావించి వెంటనే దాడి చేస్తుంది. దాని కళ్లలోకి చూడకూడదు (అయిస్ కాంటాక్ట్). పులి కళ్లలోకి నేరుగా చూడటం దానికి సవాలుగా అనిపించవచ్చు. దాని వైపు గమనిస్తూనే, చూపు కొంచెం పక్కకు తిప్పుకొని అక్కడినుండి దానిని గమనిస్తూ పోయే ప్రయత్నం చేయాలి. మన శరీరాన్ని పెద్దదిగా చూపే ప్రయత్నం లో మన చేతులను పైకి ఎత్తి లేదా మన దగ్గర ఉన్న కోటు/దుప్పటిని, కొంగు వెడల్పుగా చాపి దానికన్నా ఎత్తుగా, పెద్దగా ఉన్నట్లు కనిపించేలా చేయాలి. దీనివల్ల పులి మనల్ని చూసి కొంచెం వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. పులికి శబ్దం ఇష్టం ఉండదు. దాని ధ్వని వినికిడి తీవ్రత (డిసైబెల్స్) చాలా తక్కువ. గట్టిగా అరుస్తూ పెద్ద పెద్ద శబ్దం చేయాలి లేదా చేతిలో ఉన్న వస్తువులతో గట్టిగా శబ్దం చేయాలి. అసాధారణమైన శబ్దాలు పులిని గందరగోళానికి గురిచేస్తాయి.
అతర్వాత నెమ్మదిగా వెనక్కి తగ్గి పులి వైపు చూస్తూనే, దానికి వెన్ను చూపకుండా నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి.

పులి ఎదురైనప్పుడు చేయకూడనివి (డోన్ట్స్) ఏమిటంటే:

వెన్ను చూపకూడదు: పులికి ఎప్పుడూ వెన్ను చూపకూడదు. దాని దృష్టి ఎప్పుడూ మీ మీదనే ఉండేలా చూసుకోండి. చెట్లు ఎక్కడం మానేయాలి: పులులు చెట్లను చాలా సులభంగా ఎక్కగలవు, కాబట్టి చెట్టు ఎక్కడం సరైన రక్షణ మార్గం కాకపోవచ్చు. రాయి వేయడం లేదా రెచ్చగొట్టడం చెయ్యకూడదు: పులిపై రాళ్లు వేయడం లేదా దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకూడదు. ఈ విధంగా చేస్తే అది దాని అగ్రెసివ్‌నెస్‌ను పెంచుతుంది.

ముందస్తు జాగ్రత్తలు (సేఫ్టీ టిప్స్): గుంపుగా వెల్లాలి. అడవి ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లకుండా కనీసం 3-4 మంది కలిసి వెళ్లడం ఉత్తమం. మాస్క్‌లు ధరించడం ఉత్తమం: సుందర్బన్స్ వంటి ప్రాంతాల్లో మనుషులు తల వెనుక భాగంలో ‘ముసుగు’ (పేస్ మాస్క్) ధరిస్తారు. పులి సాధారణంగా వెనుక నుండి దాడి చేస్తుంది కాబట్టి, వెనుక కూడా ముఖం ఉందని అది భ్రమపడి దాడి చేయదు. అటవీ పరిసరాలను గమనించి ముందుకెళ్లాలి: పులి సంచరించే ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు పక్షుల అరుపులు (అలారమ్ కాల్స్) లేదా ఇతర జంతువుల సంకేతాలను గమనిస్తూ ఉండాలి. పులి మేధస్సు గురించి పైన పేర్కొన్నట్లుగా, అది తన మనుగడ కోసం ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. మీరు బలమైన ప్రతిఘటన ఇస్తారని దానికి అనిపిస్తే, అది దాడి చేయకుండా వెనక్కి తగ్గే అవకాశం ఉంది.

తెలంగాణ అటవీ శాఖ అమలు చేస్తున్న “పులుల పునరావాస పథకం” (టైగర్ రిలొకేషన్/ఆగ్మెంటేషన్):

మరియు 2026 లక్ష్యంలో భాగంగా పులుల సంఖ్యను పెంచడానికి కేవలం ఉన్న పులులను రక్షించడమే కాకుండా, పులులు తక్కువగా ఉన్న ప్రాంతాలకు వేరే చోటి నుండి పులులను తీసుకురావడం (రిలొకేషన్) ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

1. కవాల్ టైగర్ రిజర్వ్ – ఫోకస్ ఏరియా

కవాల్ రిజర్వ్‌లో అడవి దట్టంగా ఉన్నప్పటికీ, అక్కడ ‘రెసిడెంట్ టైగర్స్’ (స్థిరంగా ఉండే పులులు) తక్కువ. అందుకే ఇక్కడ పులుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మహారాష్ట్ర నుండి తరలింపు: మహారాష్ట్రలోని తడోబా లేదా తిప్పేశ్వర్ వంటి పులుల సాంద్రత ఎక్కువగా ఉన్న రిజర్వుల నుండి ఆడ పులులను కవాల్‌కు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎర జంతువుల (శాఖహారుల) పెంపు (ప్రే ఆగ్మెంటేషన్): పులులు అక్కడ స్థిరపడాలంటే ఆహారం కావాలి. అందుకే ఇతర ప్రాంతాల నుండి జింకలు, సాంబార్లను తీసుకువచ్చి కవాల్ అడవుల్లో విడిచిపెడుతున్నారు.

2. అమ్రాబాద్ – ఆవాసాల పునరుద్ధరణ

అమ్రాబాద్‌లో ఇప్పటికే పులుల సంఖ్య పెరుగుతున్నందున, అక్కడ ఉన్న పులులు బయటకు రాకుండా అడవిలోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల తరలింపు (రిలొకేషన్ అఫ్ విల్లేజెస్): పులుల కోర్ ఏరియాలో ఉన్న గ్రామస్థులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి, వారిని అడవి బయట పునరావాసం కల్పిస్తోంది. దీనివల్ల పులులకు మానవ జోక్యం లేని ప్రశాంతమైన ఆవాసం లభిస్తుంది. నీటి వనరుల అభివృద్ధి: వేసవిలో పులులు నీటి కోసం అడవి దాటి రాకుండా ఉండటానికి అడవి లోపలే సోలార్ పంపుల ద్వారా కృత్రిమ కుంటలను ఏర్పాటు చేస్తున్నారు.

3. 2026 నాటికి లక్ష్యాలు

టైగర్ ట్రాన్స్‌లోకేషన్: 2026 గణన నాటికి కవాల్‌లో కనీసం 5 నుండి 8 పులులు స్థిరపడేలా చేయడం. స్మార్ట్ నిఘా: ‘ఈ-ఐ’ వంటి అత్యాధునిక కెమెరా నిఘా వ్యవస్థను కారిడార్లలో ఏర్పాటు చేసి, వేటగాళ్ల (పోచర్స్) నుండి పులులను రక్షించడం. కారిడార్ మేనేజ్మెంట్: మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి పులులు వచ్చే మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి, ఆ ప్రాంతాలను ‘కన్జర్వేషన్ రిజర్వ్స్’గా ప్రకటించడం లాంటి సురక్షితమైన మార్గాలను ఎంచుకుని ప్రభుత్వం (అటవీశాఖ) ఆ మార్గాలను (కార్రిడార్స్) రక్షించడం ద్వారా ఈ పునరావాస పథకాన్ని విజయవంతం చేయాలని చూస్తోంది.

పులుల జనాభా గణన లేదా ఏ.ఐ.టీ.ఈ (అల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్) అంచనా అనేది భారతదేశంలో పులుల సంఖ్యను మరియు వాటి ఆవాసాలను శాస్త్రీయంగా అంచనా వేసే అతిపెద్ద ప్రక్రియ. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ‘నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ’ (ఎన్.టీ.సి.ఏ) మరియు ‘వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ (డబ్ల్యూ.ఐ.ఐ) సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహిస్తాయి. ఇప్పుడు ఈ ప్రక్రియ కార్యక్రమం దేశంలో, మనరాష్ట్రంలో కొనసాగుతోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం (2022 ఏ.ఐ.టీ.ఈ. నివేదిక మరియు తాజా అంచనాల ఆధారంగా), పులుల సంఖ్య వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య.. భారతదేశం: 2022 గణన ప్రకారం దేశంలో కనీసం 3,167 పులులు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, తాజా విశ్లేషణల ప్రకారం ఈ సంఖ్య సగటున 3,682 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రములో: తెలంగాణలో పులుల సంఖ్య 21 గా నమోదైంది. ముఖ్యంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య 12 నుండి 21కి పెరగడం గమనార్హం.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్యకు సంబంధించి 2026 నాటికి అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం ​2026 గణన మరియు ప్రస్తుత స్థితి-​గణన సమయం: 2026లో 6వ విడత జాతీయ పులుల గణన జరుగుతోంది. దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి పనులు ( ఫేస్-1 డేటా కలెక్షన్) ప్రారంభమయ్యాయి. ​

అంచనా సంఖ్య: అమ్రాబాద్‌లో ఎర జంతువుల (ప్రే బేస్) సంఖ్య పెరగడం మరియు అటవీ రక్షణ చర్యలు పటిష్టం కావడంతో, 2026 తుది నివేదిక నాటికి ఇక్కడ పులుల సంఖ్య 25 నుండి 30 మధ్యలో ఉండవచ్చని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. *​సాంకేతికత: ఈసారి గణనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) మరియు మెరుగైన కెమెరా ట్రాపింగ్ పద్ధతులను వాడుతున్నారు, దీనివల్ల సంఖ్య మరింత ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. 2026 సర్వే పూర్తయి, కేంద్ర ప్రభుత్వం అధికారిక నివేదికను విడుదల చేసిన తర్వాతే కచ్చితమైన “లేటెస్ట్ కౌంట్” తెలుస్తుంది.

* ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 73 కి చేరుకుంది. ఇందులో మెజారిటీ పులులు నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టీ.ఆర్) లోనే ఉన్నాయి. ముఖ్యమైన రిజర్వుల వారీగా గణాంకాలు ప్రాంతం, పులుల సంఖ్య (సుమారుగా) అమ్రాబాద్ (తెలంగాణ) 21 ఎర జంతువుల పెరుగుదల వల్ల సంఖ్య పెరిగింది. కవాల్ (తెలంగాణ) 1-3, ఇక్కడ ఎక్కువగా మహారాష్ట్ర నుండి వలస వచ్చే పులులు కనిపిస్తాయి.

నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టీ.ఆర్., ఆంధ్రప్రదేశ్) 60+ ఐతే ఇది భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. పులుల జనాభా గణన లేదా ఏ.ఐ.టీ.ఈ (అల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్) అంచనా 2026 గణన లక్ష్యంలో భాగంగా 2026లో జరగబోయే 6వ విడత గణన నాటికి, తెలంగాణలో పునరావాస పథకాలు మరియు కారిడార్ల రక్షణ ద్వారా పులుల సంఖ్య 30 కంటే ఎక్కువ (30+) చేరుకుంటుందని అటవీ శాఖ అంచనా వేస్తోంది.

అడవిలో పులులను రక్షించడం వల్ల పర్యావరణానికి మరియు మానవాళికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి:

పర్యావరణ సమతుల్యత: పులి ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉండి, జింకలు, అడవి పందులు వంటి శాకాహార జంతువుల జనాభాను నియంత్రిస్తుంది. ఒకవేళ పులులు లేకపోతే, ఈ జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగి అడవిలోని మొక్కలను, గడ్డిని తినేయడం వల్ల అడవులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.

అంబ్రెల్లా స్పీసీస్ (అంబరెళ్ల స్పీసైస్): పులిని ఒక ‘అంబ్రెల్లా స్పీసీస్’గా పరిగణిస్తారు. అంటే పులులను రక్షించడం కోసం చేసే ప్రయత్నాలు పరోక్షంగా అడవిలోని ఇతర వన్యప్రాణులు, పక్షులు మరియు వృక్షజాతులను కూడా కాపాడుతాయి.

నీరు మరియు వాతావరణ భద్రత: పులులు ఉన్న అడవులు దట్టంగా ఉండి, భూగర్భ జలాలను పెంచడానికి మరియు వర్షాలు సక్రమంగా కురవడానికి దోహదపడతాయి. అలాగే, దట్టమైన అడవులు కార్బన్ డయాక్సైడ్ ని గ్రహించి గాలిని శుభ్రపరుస్తాయి.

మానవ మనుగడ: అటవీ సంపద ఆరోగ్యంగా ఉంటేనే మానవాళికి అవసరమైన ఆక్సిజన్, స్వచ్ఛమైన నీరు లభిస్తాయి. పులుల సంరక్షణ అంటే కేవలం ఒక జంతువును కాపాడటం కాదు, మొత్తం ప్రకృతిని మరియు మన భవిష్యత్తును కాపాడుకోవడమే.

 

రవి బాబు పిట్టల, ఎం.ఎస్సి., ఎం.టెక్., (పిహెచ్.డి.), పర్యావరణవేత్త, మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, జె.ఎన్.టీ.యు.హెచ్, హైదరాబాద్, జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ఎన్జీఓ, తెలంగాణ.