వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యుడిగా సేవలు ప్రారంభించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఒక రూపాయికే వైద్యం అందించి పేద ప్రజలకు వైద్యం అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పారు.
1978 లో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారనీ పేర్కొన్నారు.
YSR “పీపుల్స్ లీడర్”గా పేరుగాంచారనీ, జనహక్కులకోసం అతను నియమించిన విధానం, ప్రజలకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండటం ప్రజాదరణకు పునాది వేసిందనీ వెల్లడించారు.
1999–2004లో ఆంధ్రప్రదేశ్ లీడర్ ఆఫ్ అప్పోజిషన్‌గా ఎంతో చురుకైన పాత్ర పోషించి పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారనీ స్పష్టం చేశారు.
2004లో మొదటి సారి సీఎంగా బాధ్యత తీసుకున్నారనీ, ఈ సమయంలో “పాదయాత్ర” ద్వారా తెలుసుకున్న ప్రజా సమస్యలపై ఆయన దృష్టి సారించారు, ప్రజా సంక్షేమం పట్ల ఆయన నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారనీ, అమలు చేసి ప్రజా బంధువు అయ్యారనీ వివరించారు.
అందులో భాగంగానే, రైతుల సంక్షేమం వంటి పథకాలతో ప్రజాసేవకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఫ్రీ ఎలక్ట్రిసిటీ (రైతులకు మొదటే రోజు నుంచి), “రాజీవ్ ఆరోగ్యశ్రీ” మెడికల్ స్కీం, ఇందిరమ్మ హౌసింగ్, పింఛన్ల పెంపు, ఫీ రీయంబర్స్మెంట్, 108, మొదలైన పలు గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన శాంతి దూత కూడా ఆ మహానేతనే అని గుర్తు చేసుకున్నారు.
ఎంతో గొప్పగా సంక్షేమాన్ని అందించి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, పీపుల్స్ లీడర్ గా గుర్తింపు పొందిన ఆ మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జీవితం అందరికీ ఆదర్శం, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇంగిలేరామారావు, నాయకులు కనుమల్ల సంపత్, కనుమల్ల రామకృష్ణ , బుర్ర రమేష్ , గంగారం మహేష్, మారేపల్లి ప్రశాంత్, పెద్దిశివకుమార్ ధర్మకర్తలు గుడిశాల పరమేశ్వర్, కోరుమిండ్ల చిరంజీవి, మూడెత్తుల మల్లేష్ , బొమ్మ శ్రీనివాస్, ఎడ్ల కృష్ణ రెడ్డి, కార్మికుల రాజేందర్ గ్రామ శాఖ అధ్యక్షులు మీస రాజయ్య, బండి మల్లయ్య, మూడెడ్ల రమేష్ ,తెడ్ల బీరయ్య, ఎంతిరుపతిరెడ్డి గుండారపు సాయికుమార్ ,మన్సాని రవి, దంసాని తిరుపతి ,భోగం చిరంజీవి,కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు
